Sunday, 11 July 2021

నిబంధనల ప్రకారమే 2008 ఒప్పంద ఉపాధ్యాయుల విధులు

 నిబంధనల ప్రకారమే2008 ఒప్పంద ఉపాధ్యాయుల విధులు

*డీఎస్సీ-2008 ఒప్పంద అధ్యాపకులు నిర్ణీత నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిఉంటుంది. 


 డీఈవోతో చేసుకున్న ఒప్పంద ప్రకారం ఈ ఉపాధ్యాయులు నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి విద్యా సంవత్సం చివర్లో ఒప్పందం రద్దయి, తిరిగి జూన్ ఒకటిన మళ్లీ మొదలవుతుంది.


 ఉపాధ్యాయుల పనితీరు నచ్చకపోతే డీఈవో ఎప్పుడైనా విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. 


బదిలీ అడగకూడదు. అవసరాన్ని బట్టి ఎప్పుడు, ఎక్కడకు బదిలీ చేస్తే ఆ పాఠశాలకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది.


 న్యాయస్థానాల్ని ఆశ్రయించినా, బదిలీ చేయాలని ఒత్తిడి చేసినా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. 


కేవలం రూ.21,230 వేతనంతో పని చేయాల్సి ఉంటుంది. అదనపు భత్యాలుఉండవు. 


వార్షిక విద్యా సంవత్సరంలో ప్రధానోపాధ్యాయుడు, MEO ఇచ్చిన నివేదిక ఆధారంగా మరుసటి ఏడాది సేవల్ని కొనసాగిస్తారు.

0 comments:

Post a Comment

Recent Posts