Thursday, 15 July 2021

SSC Public examinations during the year 2020-21 Non-Furnishing of FA 1 and FA 2 in CCE portal of certain schools Instructions issued

SSC Public examinations during the year 2020-21 Non-Furnishing of FA 1 and FA 2 in CCE portal of certain schools Instructions issued. 


2020-21 విద్యా సంవత్సరమునకు సంబంధించి 10 వ తరగతి విద్యార్థుల FA 1 & FA 2 మార్కులను CSE పోర్టల్ నందు నిర్ణీత సమయంలో నమోదు చేయవలసిందిగా పలుమార్లు కోరినప్పటికీ, కొన్ని పాఠశాలలు వానిని నమోదు చేయలేదు.

అందరు DEO లు ఆయా మండలాలలో ముగ్గురు సభ్యులతో (సంబంధిత MEO మరియు ఇరువురు ఉన్నత పాఠశాలల HM లు) ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా FA 1& FA 2 మార్కులు ఇంకనూ నమోదు చేయని పాఠశాలలను సందర్శింపజేసి..... ఆ పాఠశాలల్లో జవాబు పత్రాలను, వాని మూల్యాంకనాన్ని, మార్కుల రిజిస్టర్ లను తనిఖీ చేసి ధ్రువీకరించి సదరు మార్కులను ఆ కమిటీ సంబంధిత DEO లకు సమర్పించేలా చూడాలి.

పైన పేర్కొనబడిన రికార్డు లన్నీ సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయా పాఠశాలల HM లను మార్కులు CSE పోర్టల్ లో నమోదు చేయుటకు (DEO లాగిన్ నందు) అనుమతిస్తారు.

ఈ ప్రక్రియ అంతా ది.18.07.2021 నాటికి తప్పనిసరిగా పూర్తి కావలెను

ఇప్పటికే నమోదు చేయబడిన మార్కులను సవరించుటకు ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం లేదు

ఈ మేరకు DSE AP వారు అందరు DEO లను కోరుతూ ఉత్తర్వులు జారీ చేసారు.


0 comments:

Post a Comment

Recent Posts