జూమ్ వేదికగా.. ఆన్‌లైన్ పాఠం నేటి నుంచి ఇంటర్ తరగతులు
ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
జూమ్ యాప్ ద్వారా పాఠాలు బోధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి కళాశాలలోని ఆయా గ్రూపుల్లోని విద్యార్థులను వాట్సాప్ సాయంతో ఒక్కటిగా చేర్చి యాప్‌లో పాఠాలు చెప్పనున్నారు. అధ్యాపకులు తప్పకుండా కళాశాలకు హాజరై బోధన చేయాల్సి ఉంటుంది.
213 పనిదినాలతో అకడమిక్ క్యాలెండర్
ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యే ఈనెల 12వ తేదీ నుంచి 213 రోజుల పనిదినాలు షెడ్యూల్‌లో ఇచ్చారు. రెండో శనివారం, ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు పోను మిగిలిన రోజుల్లో బోధన, పరీక్షల నిర్వహణతో షెడ్యూల్ ఉంది.
0 comments:
Post a Comment