Tuesday, 20 July 2021

టీచర్లసర్వీసు రూల్స్ సమస్యకు క్రొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్న విద్యాశాఖ

 టీచర్లసర్వీసు రూల్స్ సమస్యకు  క్రొత్త  ఆలోచనలతో ముందుకు   వెళుతున్న విద్యాశాఖ

AP లో పర్యవేక్షణ అధికారుల  లోటును పూరించుటకు  ప్రభుత్వ, పంచాయతీ రాజ్ టీచర్లకు విడి విడిగా JD స్థాయి వరకు అడహాక్ సర్వీసు రూల్స్  రూపొందించే‌ ఆలోచనలో విద్యాశాఖ?


AP లో 667 మండలాలకు గాను కేవలం  సుమారు200 మంది రెగ్యులర్ MEO మండలవిద్యాధికారులు మాత్రమే ఉన్నారు.

వీరే ఒక్కొక్కరు 2 నుండి 3 మండలాలకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా సుమారు 68 ఉపవిద్యాశాఖాధికారుల పోస్టులకు గాను కేవలం 19 మంది మాత్రమే రెగ్యులర్ DyEO లు ఉన్నారు.

DEO, RJD ఆఫీసుల్లో ఉన్న AD లు DyEO incharge లుగా ఉన్నారు. 

ఈ విధంగా ఇన్ ఛార్జుల పాలనలో విద్యాశాఖ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో క్షేత్ర. స్థాయిలో చురుకుదనము, Accontability లోపించి పర్యవేక్షణ‌ వ్యవస్థ ఫూర్తిగా కుదేలయి పోయినది.  

బయోమెట్రిక్ హాజరు   యంత్రాలతో  కొంత లోటు తీరినా బోధనలో గుణాత్మకత  మృగ్యమై పోయినదనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నది. పాఠశాలల వార్షిక తనిఖీలు మృగ్యమై పోయినదనే భావన  లో  ఉన్నది.

అలాగే‌ ప్రభుత్వ" డైట్" కళాశాలల్లో ఖాళీ లెక్చరర్ల‌ భర్తీ   కాక ఒక్క ప్రిన్సిపాల్ తప్ప ఎవరూ రెగ్యులర్ లెక్చరర్ లేరు. 

High school teachers deputation తో అరకొరగా శిక్షణ సాగుతున్నది.

అదేవిధంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, B.Ed  కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లు  లేక  కాంట్రాక్ఠు లెక్చర్లుతో పని కాని స్తున్నారు.

ఈ విధంగా మానవ వనరుల అభివృధ్ధిలో ప్రథాన ఫాత్ర  వహించే విద్యాశాఖలో ఇన్ని పోస్టులు  దశాబ్దాల తరబడి ఖాళీగా ఉండటం నిజంగా శోచనీయము. తత్ఫలితంగా పేదవర్గాల  పిల్లలకు  గుణాత్మక విద్యకు దూరమవుతున్నారు 

ఈ పరిస్థితి కి కారణమైన చారిత్రక వివరాల్లోకి వెళితే ..


పంచాయతీ రాజ్ (PR) టీచర్ పోస్టులు  Local cader కాలేదనే సాంకేతిక పరమైన సాకుతో వివక్షతను ఎదుర్కంటున్న లక్షలాది మంది పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల ఆకాంక్షల మేరకు 1998 & 2005 & 2017 లలో ప్రభుత్వ, పంచాయతీ  టీచర్లకు ఉమ్మడిగా, ఏకీకృతం చేస్తూ సర్వీసు రూల్స్ ను రూపొందించి ఉమ్మడి సీనియారిటీ తో HM, MEO, Diet lecturer పదోన్నతులకు    ఉపక్రమించినది. ఈ రూల్స్ పురిటి వాసన పోక ముందే‌ 4% గా కూడా లేని‌ కొందరు ప్రభుత్వ‌ టీచర్లు, కోర్టులను  ఆశ్రయించి  సాంకేతిక కారణాల లోపంతో  అమలును నిలిపి వేయించంటంలో Success అయ్యారు.

2017 లో  మన Honbl Vice president మాన్య శ్రీ M  వెంకయ్య నాయుడు గారి చొరవతో వచ్చిన  Local cader రాష్ట్పపతి ఉత్తర్వులు  కూడా ఆధికారుల పొరబాటు తో న్యాయస్థానాలలో  నిలువ లేకపోయినవి. 

ఇప్పటికీ అస్థిత్వములో లేని  AP Tribunal లోనే‌ ఈ కేసు అపరిష్కృతంగానే ఉన్నది.  

ఈ తాజా ఏకీకృత సేవా నిబంధనల G.O లు 73, 74, 75 Status quo సుప్తావస్త నుండి బయటకు వస్తాయనే నమ్మకం 100% టీచర్లకు లేదు.

ఇప్పుడు  ఏమిటి ప్రత్యామ్నాయం!  దాయాదుల పోరు ఇలా కొనసాగాల్సిందేనా?

విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయము లోని   అధికారులు ఈ సమస్యకు క్రొత్త  పరిష్కార ప్రతిపాదనలు సిధ్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలుస్తున్నది. అనధికారికంగా ఇటీవల యూనియన్ నాయకులతో   కూడా సంప్రదించి మెజారిటీ యూనియన్ల నుండి ఏకాభిప్రాయమును సాధించి ఈ దిశగా‌ముందుకెళ్ళాలని నిర్ణయించు కొన్నట్లు తెలుస్తున్నది.

ఈ క్రొత్త ప్రతిపాదనల గురించి  "కాస్త అటూ ఇటూగా" తెలిసిన Basic information (కొన్ని మార్పులు ఉండవచ్చును) ఫ్రకారము........


ప్రభుత్వ, పంచాయతీ రాజ్ టీచర్లకు విడి విడి గానే తాత్కాలిక సర్వీసు రూల్స్ ఉంటాయి.

HM పోస్టు వరకు 2009 లోని అడహాక్ సర్వీసు రూల్స్ G.O ల‌‌ రూపంలోనే విడి  విడిగా సర్వీసు రూల్స్  ఉంటాయి.

మిగిలిన గెజిటెడ్ పోస్టులకు Additional Director వరకు Govt, PR పోస్టులకు కూడా విడి  విడిగా సర్వీసు రూల్స్   ఉంటాయి.

667 MEO ‌పోస్ఠులలో 1986 కు ముందు ఉన్న పాత సమితుల స్థాయి తో   సమానమైన అదనపు పోస్టులను (, సుమారు212  మండలాల్లో 25-30%) ప్రభుత్వ SA లకు, 667 మండలాల్లో MEO ( Panchayat  Raj ) SA లతో  పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. MEO (Govt) తన పరిధిలోని  Govt , Aided, Private Schools ను Superwise  చేస్తారు. MEO (LB) తన పరిధిలోని PR schools ను, SSA  కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.

అదే‌విధంగా DyEO పోస్టుల్లో అదనముగా 30% వరకు Govt HM/MEO లకు, మిగిలిన వాటిని HM/MEO ( PR) లో పదోన్నతులకు కేటాయిస్తారు.

ZP (DyEO) పోస్ఠులను  విద్యాశాఖ‌లోని Supdt కేడర్ వారి పదోన్నతులకు కేటాయిస్తారుట.  

దీని కనుగుణంగా ఫదోన్నతుల ప్యానెల్ లో రోస్టర్ పాయింట్లు  కేటాయిస్తారు.

అదే విధంగా Diet, Junior lecturer, పదోన్నతుల్లో రోస్ఝర్ పాయింట్లు కేటాయిస్తారు. SC, ST, PH రిజర్వేషన్లు కూడా పాటించబడును.

DyEO, DEOలు Govt PR లకు విడి విడిగా ఉంటారు. Dyeo, DEO (Govt) లు Govt, Aided, Private Schools ను వర్యవేక్షిస్తారు. DyEO & DEO (PR) లు PR schools ను, SSA  విధులను నిర్వహిస్తారు.

Addl Director, JD పోస్టులను రోస్టర్ పాయింట్లతో పదోన్నతులు ఇస్తారా? 

ఈ సీనియారిటీ జాబితాలో Govt, PR శాఖ లో నుండి వచ్చిన క్రింది స్థాయి అధికారులకు  దామాషా లో రోస్టర్ పాయింట్లు కేటాయిస్తారు.

Draft copy (చిత్తు  ప్రతి) బయటకు వస్తే మరింత ‌clarity వచ్చును.

అదనపు‌ MEO, Dyeo, DEO పోస్టుల మంజూరుకు  అవసరమైన బడ్జెట్ కేటాయింపులు కోసం, ఖాళీ craft, Drawing, పోస్టులను Supress (రద్దు) చేయాలని ఆర్ధిక శాఖ సూచిస్తే వాటిని  అవసరమైనంత సంఖ్యలో  రద్దు చేస్తారు.

విద్యార్హతల విషయములో అమలులో ఉన్న సర్వీసు రూల్స్ ను అనువర్తిస్తారు.

పై చెప్పిన దంతా ఊహించు కోవటానికి, కాగితాల‌ మీద చూడటానికి అద్భుతంగా ఉంది. భవిష్యత్ పై ఆశలు కలిగిస్తున్నది. దీని అమలు లో ఎన్నో అవాంతరాలు ఎన్నో అభ్యంతరాలు రావచ్చు. ప్రభుత్వం, యూనియన్లు ఉమ్మడిగా చిత్త శుద్ధి చూపిస్తే వీటిని రూపొందించటం పెద్ద కష్టం కాదు. 

సర్వీసు రూల్స్ సాధన కొరకే‌ MLC లు గా గెలిచిన వారు,  ఉపాధ్యాయ సంఘాలు, అధికారులను విద్యా శాఖా మంత్రి గారిని, Honble CM గారి తో‌ ఎప్పటి కప్పుడు  ప్రాతినిధ్యము‌ చేసి అవరోధాలను అధిగమించి త్వరలోనే ఉత్తర్వుల రూపంలో "శుభం" కార్డు వేయిస్తారని  ఆశిద్దాము.

గతంలో లాగా న్యాయస్థానాల  పాలవకుండా చూడాలి.

విద్యాశాఖలో B.Ed అర్హతలు గల ministerial Staff తమ Dyeo, DEO, JD లుగా తమ  పదోన్నతుల‌ అవకాశాలు   ప్రతిపాదిత నూతన సేవా నిబంధనల ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ , పంచాయతీ రాజ్ టీచర్ల మధ్య రాజీ కుదిరి కథ సుఖాంతమగునా?

ఏమి జరుగుతుందో చూడాలి

సర్వీసు రూల్స్‌ సమస్య పరిష్కారమునకు మరల ఊపిరి పోసి మరల  ఆశలు చిగురింప చేస్తున్న విద్యాశాఖ అధికారులను అభినందిద్దాం!  

పరిష్కార మార్గములో వచ్చే అన్ని అవరోధాలను అథిగమిస్తారని ఆశిద్దాం.

0 comments:

Post a Comment

Recent Posts