Sunday, 18 July 2021

విశాఖలో ఇద్దరు పిల్లలకు కరోనా అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ

 విశాఖలో ఇద్దరు పిల్లలకు కరోనా అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ

విశాఖపట్నంలో ఇద్దరు పిల్లలకు కరోనా సోకడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో థర్వైవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నప్పటికీ ముందుగానే ఇటువంటి కేసులు నమోదవడం పై  ఆందోళన వ్యక్తమవుతోంది. 


విశాఖ జిల్లా, నాతవరానికి చెందిన 6ఏళ్ల బాలునికి, మాకవరపాలెం ప్రాంతానికి చెందిన 5 నెలల పాపకు వ్యాధి సోకండంతో వీరిని చికిత్స నిమిత్తం తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరువాత మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచు తరలించారు. 

అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ ఆ గ్రామాల్లో శానిటైజేషన్  చేయడంతోపాటు మాస్కులు పంపిణీ చేసింది. ఈ పిల్లలకు సంబంధించిన తల్లులు ఇద్దరికీ కరోనా రావడంతో పిల్లలకు టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించింది. ఇందులో 5 నెలల పాప తల్లికి ఇటీవల టీకా కూడా వేసినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది.

 ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే 99 శాతం టీకా పూర్తిచేసినప్పటికీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇటీవల కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ఇవ్వడంతో చాలా మంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా తిరుగుతున్నారు.


 ముఖ్యంగా మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు  జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటివి కరోనా పెరుగుదలకు దోహదపడ తాయని, జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తోంది.

0 comments:

Post a Comment

Recent Posts