ప్రభుత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల గుర్తింపు నియమ నిబంధనలను సమీక్షించేందుకు అధికారులతో కూడిన కమిటీ
'సంఘాల' గుర్తింపు నిబంధనల సమీక్షకు కమిట
ప్రభుత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల గుర్తింపు నియమ నిబంధనలను సమీక్షించేందుకు అధికారులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఏపీ సివిల్ సర్వీసెస్ 2001 నిబంధనల ప్రకారం ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లేదా గుర్తింపు ఉపసంహరణ అమల్లో ఉంది.
అయితే, ఈ నియమ నిబంధనలను సమీక్షించడంతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులు, కొత్త నిబంధనలు తీసుకురావడంపై అధ్యయనం చేసేం దుకు ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక సీఎస్ అధ్యక్షతన రెవెన్యూ శాఖ ముఖ్యకార్య దర్శి, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ముఖ్యకార్యదర్శి కన్వీనర్ కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
వివిధ సంఘాల ప్రతిని ధులు, నిపుణులతో చర్చించి వీలైనంత త్వరగా సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా పేర్కొంది.
0 comments:
Post a Comment