Sunday, 18 July 2021

కూలీలుగా కేంద్రం మంత్రి తల్లిదండ్రులు

కూలీలుగా కేంద్రం మంత్రి తల్లిదండ్రులు

 తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌. మురుగన్ కేంద్రమంత్రి పదవి చేపట్టి వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మురుగన్ ఏకంగా కేంద్ర మంత్రి అయిపోవడంతో ఆ రాష్ట్రంలోని కొందరు నాయకులు షాక్‌కు గురయ్యారు. అయితే కేంద్ర మంత్రి మురుగన్ కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.


 ఆయన తల్లిదండ్రులైన లోకనాధం, వరుదమ్మాళ్ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కొడుకు కేంద్రమంత్రి అయినా వారు తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలోని కోనూరులో ఓ చిన్న ఇంటిలో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. 

కొడుకుపై ఆధారపడకుండా నిత్యం పోలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ దినసరి కూలీలుగా బతుకుతున్నారు. ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు ఆయన తల్లిదండ్రులను పలకరించారు.


కేంద్ర కేబినెట్‌లో తన కొడుకు మంత్రి కావడంపై తల్లి వరదమ్మాళ్‌ స్పందించారు. కేబినెట్‌లో స్ధానం సంపాదించడంపై సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయినా తన కొడుకు కేంద్ర మంత్రి పదవి దక్కితే నేనేమీ చేయాలని తిరిగి ప్రశ్నించింది

0 comments:

Post a Comment

Recent Posts