Saturday, 17 July 2021

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు

_న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జూలై 1 నుంచి కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి 28 శాతానికి ఇటీవల పెంచిన కేంద్రం మరో బొనంజా ప్రకటించింది.


 తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలకు హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను కూడా పెంచింది. రివైజ్ చేసిన హెచ్ఆర్ఏను ఆగస్టు నుంచి ఉద్యోగులు అందుకోనున్నారు. 

డీఏ 25 శాతం దాటినందున హెచ్ఆర్ఏ పెంచినట్టు కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు నివససిస్తున్న సిటీలను బట్టి వివిధ కేటగిరిలుగా హెచ్ఆర్ఏను అందుకుంటారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు

ఎక్స్ కేటగిరీ సిటీల్లో ఉన్నవాళ్లకు 27 శాతం, వై, జడ్ కేటగిరీలకు 19, 9 శాతం పెంపు ఉంటుంది. డీఏ 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ రేట్లు కేటగిరీలను బట్టి 30 శాతం, 20 శాతం, 10 శాతంగా రివైజ్ అవుతాయి.


 50 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న ఉంటే ఎక్స్ కేటగిరి సిటీ కింద పరిగణిస్తారు. 5 లక్షలకు పైగా  జనాభా ఉంటే వై కేటగిరి, 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే జడ్ కేటగిరిగా పరిగణిస్తారు.

0 comments:

Post a Comment

Recent Posts