Saturday, 3 July 2021

VRO లకు డైరెక్ట్ గా సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులు*

 *VRO లకు డైరెక్ట్ గా సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులు*

*గత కొన్ని సంవత్సరాలుగా VRO పదోన్నతి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా VRO లకు సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి అవకాశం కల్పిస్తూ G.O. నెంబర్ 132 లో ఉత్తర్వులు ఇచ్చారు. 


కానీ అందులో VRO లు సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి పొందాలంటే 2 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ గా పని చేయాలనే నిబంధన పెట్టారు.

 ఈ నిబంధన తొలగించాలని, పదోన్నతులలో వీఆర్వోల కోటా పెంచాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తో పాటు మరి కొన్ని సంఘాలు కోరాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్య మంత్రి గారు వెంటనే 2 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ గా పని చేయాలనే నిబంధన తొలగించాలని,  తర్వాత కోటా పెంపుపై పరిశీలించాలని నిర్ణయించారు.* 


*VRO లకు డైరెక్ట్ గా సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించే ఫైలుపై గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీ చేస్తారు. VRO లకు సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.*

0 comments:

Post a Comment

Recent Posts