Monday, 2 August 2021

ఆగస్టు 7న ‘పది’ ఫలితాలు

7న ‘పది’ ఫలితాలు

*♦అంతర్గత పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు*

*♦3 ఎఫ్‌ఏ, ఒక ఎస్‌ఏ పరీక్షను బట్టి మార్కులు*

*♦ఈ ఏడాది పిల్లలకు రెండు ఎఫ్‌ఏలు ఆధారం*

*♦ఎఫ్‌ఏలలో స్లిప్‌టెస్ట్‌కు 70 శాతం వెయిటేజీ*

*♦మిగతా 3 అంశాలకు 30 శాతం వెయిటేజీ*

*♦ప్రతిభను బట్టి గ్రేడ్లు.. అందరికీ పాస్‌ మార్కులు*


*🌻అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి):* కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఫార్మాటివ్‌ అసె్‌సమెంట్ల (ఎఫ్‌ఏ) ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి తుది మార్కులు, వాటి ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నారు. ఆ ప్రకారం ఈ నెల 7న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహించలేదు. అయితే పాస్‌ అనడం కంటే.. వారికి కూడా మార్కులు, వాటి ఆధారంగా గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్లు కేటాయిస్తే ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ ఏడాదితోపాటు, గతేడాది విద్యార్థులకు కూడా ఇప్పుడు గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించింది.  పదో తరగతి పరీక్షల ఫలితాల మూల్యాంకనం ఎలా చేయాలన్న దానిపై ఏర్పాటుచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఛాయారతన్‌ కమిటీ సిఫార్సులను ఆమోదించి ఈ విధానాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 

*♦గతేడాది మూల్యాంకనం ఇలా..*

2019-20 విద్యా సంవత్సరం విద్యార్థులకు ఫైనల్‌ పరీక్షలు రద్దయినా.. అంతకుముందు అంతర్గతంగా మూడు ఫార్మేటివ్‌, ఒక సమ్మేటివ్‌ పరీక్ష నిర్వహించారు. మూడు ఫార్మేటివ్‌ పరీక్షలను ఒక్కోదానికి 50 మార్కుల చొప్పున నిర్వహించారు. ఈ మూడు పరీక్షల సగటును తీసుకుని.. వాటి ఆధారంగా ఫైనల్‌ పరీక్షల్లో 50 మార్కులు కేటాయిస్తారు. మరోవైపు 100 మార్కులకు నిర్వహించిన ఒక సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎస్‌ఏ)లో వచ్చిన మార్కుల ఆధారంగా మిగతా 50 మార్కులు కేటాయించి గ్రేడ్లు నిర్ణయిస్తారు. 

*♦ఈ ఏడాది విద్యార్థులకు ఇలా..*

2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో రెండు ఫార్మేటివ్‌ పరీక్షలనే నిర్వహించారు. అందుకే వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని వాటిలో వచ్చిన మార్కులకు వెయిటేజి ఇచ్చి తుది మార్కుల కేటాయింపు చేస్తారు. ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ పరీక్షలో భాగంగా నిర్వహించిన స్లిప్‌ టెస్ట్‌కు 70 శాతం వెయిటేజీ ఇస్తారు. ఫార్మేటివ్‌ పరీక్షలోని మిగతా మూడు అంశాలు అంటే విద్యార్థి ప్రవర్తన, హోంవర్క్‌-క్లా్‌సవర్క్‌, ప్రాజెక్టు వర్కులకు ఇచ్చిన మార్కులకు 30 శాతం వెయిటేజి ఇస్తారు. ఒకవేళ విద్యార్థులెవరైనా ఒకే ఎఫ్‌ఏ పరీక్ష రాసుంటే.. దాన్నే పరిగణలోకి తీసుకుంటారు.


🌻ప్రతి ఒక్కరికీ కనీస పాస్‌ మార్కులు మాత్రం ఇస్తారు. ఇక 2017, 2018, 2019 విద్యాసంవత్సరాల్లో పదో తరగతి చదివి, కొన్ని సబ్జెక్టులు ఫెయిలైన వారు.. ఆ తర్వాత  సంవత్సరాల్లో పరీక్షలు రాసుంటే వారికి మొదటిసారి రాసిన ఎఫ్‌ఏలోని మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారు.

https://bit.ly/3rJqgBp


0 comments:

Post a Comment

Recent Posts