Tuesday 3 August 2021

AP Inter‌ supplementary examinations schedule released

AP Inter‌ supplementary examinations schedule released  


 *సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు*

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్‌ సెకండియర్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ఇంటర్‌ బోర్టు పేర్కొంది.


0 comments:

Post a Comment

Recent Posts