Saturday 21 August 2021

AP Policy for takeover of Willing Private Aided Schools including Minority Schools by the Government G. O. MS No. 50

AP Policy for takeover of Willing  Private Aided Schools including Minority Schools by the Government G. O. MS No. 50.


 ప్రభుత్వంలోకి 'ఎయిడెడ్'.. లేకుంటే సాయం కట్

 రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలను ప్రభు త్వంలో విలీనం చేయాలని సర్కారు ఉత్తర్వులు చేసింది. లేకపోతే... ఇకపై సాయం అందించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశా లల విషయంలో ఇప్పటికే ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం... తాజాగా పాఠశాలల విష యంలోను మార్గదర్శకాలు ఇచ్చింది.

 రాష్ట్రంలో సుమారు 2 వేల ఎయిడెడ్ పాఠశాల లుంటాయని అంచనా. ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన ఆస్తులు, భవనాలను ఒక డాక్యుమెంట్ ద్వారా ప్రభుత్వానికి దఖలు పర్చాల్సి ఉంటుందని, సదరు డాక్యుమెం ట్ను వెనక్కి తీసుకోడానికి వీలుండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా విలీనానికి ఇష్టపడకుంటే వారికి సాయం నిలిపేస్తామని స్పష్టం చేశారు. ఆయా పాఠశాలలో ఉన్న ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ స్కూళ్లకి తీసుకుంటారు

• ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమైన ఎయిడెడ్‌, మైనారిటీ పాఠశాలల స్వాధీనం, అన్‌ఎయిడెడ్‌గా కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్న బడుల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తులతో సహా అప్పగించేందుకు, సిబ్బందిని మాత్రమే ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన యాజమాన్యాల నుంచి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.


●పాఠశాలలను ఆస్తులతోపాటు అప్పగించేందుకు అనుమతి తెలిపిన విద్యా సంస్థలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా, భేషరతుగా స్వాధీనం చేసుకుంటుంది. యాజమాన్యాలు స్థిర, చరాస్తులను అప్పగించాక అవన్నీ ప్రభుత్వ సంస్థలుగా మారతాయి. స్వాధీన ప్రక్రియ పూర్తయ్యాక విద్యాసంస్థల్లోని మిగులు ఆస్తుల్ని ప్రజావసరాలకు వినియోగించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.


●  ఆస్తులు అప్పగించేందుకు ఆమోదం తెలిపిన పాఠశాలల్లోని సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకుంటారు. వారి కోసం సర్వీసు నిబంధనల్ని రూపొందిస్తారు. ఈ బడుల్లోని తాత్కాలిక(పార్ట్‌ టైమ్‌) సిబ్బందిని పొరుగు సేవల సిబ్బందిగా పరిగణిస్తారు.


​​​​​​​● అన్‌ ఎయిడెడ్‌గా కొనసాగాలనుకునే పాఠశాలలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఇచ్చే గ్రాంట్లు, ఆస్తులను ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా అవసరాల కోసం వినియోగించకూడదు. ఒకవేళ ఆయా బడులకు ప్రభుత్వం ఉచితంగా, రాయితీపై లేదా మార్కెట్‌ విలువ ఆధారంగా భూమిని కేటాయిస్తే... దాన్ని ముందుగా పేర్కొన్న ప్రకారం మినహా ఇతర అవసరాలకు వినియోగించకూడదు. వివిధ సంస్థలు, దాతలు ఇచ్చిన భూముల విషయంలో ఇదే వర్తిస్తుంది.

AP Policy for takeover of Willing Private Aided Schools including Minority Schools by the Government G. O. MS No. 50


0 comments:

Post a Comment

Recent Posts