Friday, 6 August 2021

వినూత్నంగా AP స్కూల్ క్యాలెండర్ ఉపాధ్యాయుల పాత్ర ,తల్లిదండ్రుల పాత్ర ఇలా..

 వినూత్నంగా AP స్కూల్ క్యాలెండర్ ఉపాధ్యాయుల పాత్ర ,తల్లిదండ్రుల పాత్ర ఇలా..


నిర్ణీత బరువులోనే స్కూల్‌ బ్యాగ్‌

స్కూల్‌ పెర్‌ఫార్మెన్సు రిజిస్టర్ల ఏర్పాటు

ప్రతి స్కూలులో అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌ రిజిస్టర్లను నిర్వహించాలి.

పరీక్ష వివరాలు, విద్యార్థుల మార్కులను అందులో నమోదుచేయాలి.

 విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలతో ప్రత్యేక రికార్డులు నిర్వహించాలి.

టీచర్లు ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

పాఠ్యబోధన ఎలా సాగుతోందో తెలుసుకునేలా క్లాస్‌ అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌ పెట్టాలి.

స్కూలుకు సందర్శకులు వస్తే వారి అభిప్రాయాలు నమోదు చేయాలి.

స్కూలులోని మౌలిక సదుపాయాలు, వాటి స్థితిగతులపైనా రికార్డులు నిర్వహించాలి.

నిర్ణీత బరువులోనే స్కూల్‌ బ్యాగ్‌


విద్యార్థి పుస్తకాల బ్యాగ్‌ బరువు నిర్ణీత ప్రమాణాల్లోనే ఉండాలి.

అవి పెరగకుండా చర్యలు తీసుకోవాలి.

  • 1, 2 తరగతుల వారికి 1.5 కిలోలు..
  •  3-5 తరగతుల వారికి 2-3 కిలోలు..
  •  6-8 తరగతుల వారికి 4 కిలోలు.. 
  • 8-9 తరగతుల వారికి 4.5 కిలోలు.. 
  • 10వ తరగతి వారికి 5 కిలోలు మాత్రమే బ్యాగు బరువు ఉండాలని ఎస్సీఈఆర్టీ సూచిస్తోంది.

ఉపాధ్యాయుల పాత్ర ఇలా.

తరగతి గదిలో విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేలా బోధన సాగించాలి.

మూల్యాంకన పద్ధతులను అనుసరించి విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో గుర్తించి వారికి తగిన సహకారం అందించాలి.


పిల్లల తల్లిదండ్రులతో సమావేశమై వారి భాగస్వామ్యాన్ని సూచించాలి.

పేరెంట్స్‌ కమిటీలను సమావేశపరిచి వారికి విద్యార్థుల స్థితిగతులను, జిల్లాస్థాయిలోని ప్రమాణాల గురించి వివరించాలి.

విద్యార్థులు అంతకుముందు తరగతుల అంశాలను వినకపోయి ఉంటే వాటిని ప్రత్యేకంగా బోధించాలి.

తల్లిదండ్రుల పాత్ర ఇలా..

విద్యార్థులకు ఇచ్చే హోంవర్క్, వాట్సప్‌ పాఠాలు, ఇతర ప్రక్రియలను ఇంటి నుంచి చేసేలా సహకరించాలి.

దీక్షా యాప్‌ ద్వారా బోధనాంశాలపై అవగాహన పెంచుకునేలా చేయాలి.

ఆటపాటలు, పుస్తక పఠనం వంటి పాఠ్యేతర అంశాలనూ చేయించాలి.

ఇక స్థానిక పంచాయతీ, మున్సిపాల్టీ, తదితర సంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలనూ క్యాలెండర్లో వివరించారు.

కమ్యూనిటీ యాక్టివిటీల కింద రీడింగ్‌ మేళాలు వంటివి నిర్వహించాలి.

0 comments:

Post a Comment

Recent Posts