Thursday, 12 August 2021

ఏపీ లో ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యాకే స్కూళ్లు తెరవాలని హైకోర్టు లో పిటిషన్

ఏపీ లో ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యాకే స్కూళ్లు తెరవాలని హైకోర్టు లో పిటిషన్


ఈనెల 16 నుంచి ఏపీ వ్యాప్తంగా స్కూళ్లను ప్రారంభించాలని జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

అయితే కరోనా నేపథ్యంలో స్కూళ్లను రీ ఓపెన్ చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

ఉపాధ్యాయులకు ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని… ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లను ఎలా తెరుస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. 



ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది 85 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశామని కోర్టుకు తెలిపారు. 

మిగిలిన టీచర్లకు కూడా త్వరితగతిన టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.


అయితే ఈ పిటిషన్‌కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

0 comments:

Post a Comment

Recent Posts