e-RUPIని విడుదల చేసిన ప్రధాని మోడీ డిజిటల్ పేమెంట్స్ లో మరో కొత్త శకం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ e-RUPIని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం e-RUPIని తీసుకువచ్చింది. e-RUPI ప్రీపెయిడ్ ఇ-వోచర్, దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అభివృద్ధి చేసింది. దీని ద్వారా, నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుత పేమెంట్ విధానాలకంటే సులభంగా క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ-రూపీ పేమెంట్ వ్యవస్థ(E-RUPI)ను ప్రవేశపెట్టారు. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్‌ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్‌ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు.ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. నేడు దేశం డిజిటల్ పాలనకు కొత్త కోణాన్ని ఇస్తోందన్నారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలలో డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(DBT)ని మరింత ప్రభావవంతంగా మార్చడంలో eRUPI వోచర్లు భారీ పాత్ర పోషించబోతున్నాయన్నారు. టార్గెటెడ్, పారదర్శక మరియు లీకేజ్ ఫ్రీ డెలివరీ లక్ష్యంగా eRUPI పని చేయనుందన్నారు. ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రభుత్వేతర సంస్థ ఎవరికైనా వారి విద్య లేదా వైద్య చికిత్సలో మద్దతు ఇవ్వాలనుకుంటే, వారు నగదు ఇవ్వడానికి బదులుగా ఐ-రూపీని ఉపయోగించాలని ప్రధాని అన్నారు. విరాళంగా ఇవ్వబడిన మొత్తం చెప్పిన పనికి మాత్రమే ఉపయోగించబడుతుందని ఇది నిర్ధారిస్తుందని వివరించారు.
ఇంతకుముందు మన దేశంలో కొంతమంది ధనవంతులకు మాత్రమే సాంకేతికత అందుబాటులో ఉండేదన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. నేడు మనం టెక్నాలజీని పేదలకు సహాయం చేయడానికి సాధనంగా, వారి పురోగతికి ఒక సాధనంగా చూస్తున్నామన్నారు. టెక్నాలజీని అవలంభించడం మరియు దానితో కనెక్ట్ అవ్వడంలో నేడు దేశం ముందు వరుసలో ఉందన్నారు. 21 వ శతాబ్దంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రజలను ఎలా ముందుకు తీసుకెళ్తున్నామనేదానికి ఈ-రూపీ ఒక ఉదాహరణ అని అన్నారు. భారతదేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో ఇది ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నానని ప్రధాని అన్నారు.
0 comments:
Post a Comment