Tuesday, 31 August 2021

TS EAMCET Counselling Schedule 2021 Important Dates Fees Payment Step by step Process

TS EAMCET Counselling Schedule 2021 Important Dates Fees Payment Step by step Process


తెలంగాణ ఎంసెట్(TS EAMCET 2021) ఎగ్జామ్ కు సంబంధించిన కౌన్సెలింగ్(EAMCET Counselling) ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. కౌన్సెలింగ్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, కావాల్సిన సర్టిఫికేట్ల(Certificates) వివరాలు ఇలా


తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS EAMCET 2021) పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ (TS EAMCET Counselling Schedule) ఆగస్టు 30 అంటే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో అనేక వాయిదాల అనంతరం తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ ను ఆగస్టు 4న నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను (EAMCET Results)ఆగస్టు 25న విడుదల చేశారు. అయితే ఎంసెట్ లో విద్యార్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించనున్నారు. తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు tseamcet.nic.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కౌన్సెలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను సందర్శించి కూడా వివరాలను తెలుసుకోంచ్చు.


ఎంసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు..


  • ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, స్లాట్ బుకింగ్ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్సెప్టెంబర్ 4 నుంచి 11 వరకుఆప్షన్ల నమోదుసెప్టెంబర్ 4 నుంచి 13 వరకు
  • సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 15 వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు

కౌన్సెలింగ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు


1.ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్

2.ఆధార్ కార్డు

3.టెన్త్, ఇంటర్ మెమోలు

4.టీసీ సర్టిఫికేట్స్

5.కుల, ఆధాయ ధ్రువీకరణ సర్టిఫికేట్

6.రెసిడెన్స్ సర్టిఫికేట్

ఖ్యమైన దశలు..

ఎంసెట్ ఎగ్జామ్ లో అర్హత సాధించి కౌన్సెలింగ్ కు హాజరు కావాలనుకుంటున్న అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

1.ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి

2.స్లాట్ బుక్ చేసుకోవాలి,

3.అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి.

4.రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

5.ఆప్షన్ నమోదు కు లాగిన్ అవ్వాలి.

6.ఆప్షన్ల నమోదు అనంతరం సేవ్ చేసిన ఆప్షన్లను ప్రింట్ తీసుకోవాలి.

ఫీజు చెల్లింపు ఇలా..


  • అభ్యర్థులు మొదటగా tseamcet.nic.in ను సందర్శించాలి. అనంతరం “PAYMENT OF PROCESSING FEE” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ నంబరుపై కనిపించే రిజిస్ట్రేషన్ నంబర్, టెన్త్ మెమోపై ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్ హాల్ టికెట్ నంబరును నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • అనంతరం ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ తదితర వివరాలను నమోదు చేయాలి.
  • మొబైల్ నంబర్ ను తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి . ఒక సారి నమోదు చేసిన తర్వాత మొబైల్ నంబరు ను మార్చడానికి అవకాశం ఉండదు.
  • అనంతరం క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా అభ్యర్థులు రూ. 1200ను రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

కౌన్సెలింగ్ కు సంబంధించిన ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు tseamcet.nic.in వెబ్ సైట్ ను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ఉండాలి.

0 comments:

Post a Comment

Recent Posts