Thursday, 16 September 2021

ISRO Recruitment 2021: ఇస్రోలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే

 ISRO Recruitment 2021: ఇస్రోలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే.


బెంగళూరులోని యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం (UR Rao Satellite Centre)లో పని చేసేందుకు ఇస్రో (ISRO) జూనిర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. ఇందు కోసం ఇస్రో రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా
జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం ఎంపికైన వారికి నెలకు రూ .31,000 వేతనం అందిస్తారు. రీసెర్చ్ అసోసియేట్‌గా ఎంపికైన వారికి నెలకు రూ .47,000 చెల్లిస్తారు. మొత్తం 18 కొత్త జూనియర్ రీసెర్చ్ ఫెలో(Junior Research Fellow), రీసెర్చ్ అసోసియేట్(Research Associate) పోస్టులను భర్తీ చేస్తారు

ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 1, 2021 వరకు అవకాశం ఉంది.

.

అర్హతలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా 16 జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) ఉద్యోగాలను, రెండు రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ) ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అర్హతలు(Eligibility) ఇలా ఉన్నాయి.

పోస్టు పేరుఅర్హతలుఖాళీలుజేఆర్ఎఫ్-1ఎమ్మెస్సీ ఫీజిక్స్(Physics) లేదా ఇంజినీరింగ్ లో ఫిజిక్స్, ఆప్టిక్స్, అప్లేయిడ్ ఆప్టిక్స్ చేసి ఉండాలి. నెట్(NET) లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.1జేఆర్ఎఫ్-2ఎమ్మెస్సీ ఫీజిక్స్ లేదా ఇంజినీరింగ్ లో ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఆఫ్ ఫిజిక్స్ చేసి ఉండాలి. నెట్ లో ఉత్తీర్ణత(Qualify) సాధించి ఉండాలి.2జేఆర్ఎఫ్-3ఎమ్మెస్సీ ఫీజిక్స్ లేదా ఇంజినీరింగ్ లో ఫిజిక్స్, ఆప్టిక్స్, లేదా ఎంఈ, ఎంటెక్లో మెటిరీయల్ సైన్స్ చదివి ఉండాలి. నెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.1జేఆర్ఎఫ్-4ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, ప్లానటరీ ఫిజిక్స్(Planetary Physics) లో ఎమ్మెస్సీ(MSc) చేసి ఉండాలి. నెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.3జేఆర్ఎఫ్-5ఎలక్ట్రానిక్స్‌లో ఎంఈ, ఎంటెక్ చేసి ఉండాలి. డిజిటల్ డిజైన్(Digital Design), వీహెచ్‌డీఎల్(Phd) ఓ సబ్జెక్టుగా ఉండాలి. నెట్ పాసై ఉండాలి.4జేఆర్ఎఫ్-6ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. నెట్ పాసై ఉండాలి.2జేఆర్ఎఫ్-7కంప్యూటర్ సైన్స్‌, ఆర్టిఫిసియల్ ఇంటలిజన్స్‌(Artificial Intelligence), మిషన్ లర్నింగ్‌, డేటా అనలిటిక్స్‌(Analytics)లో ఎంఈ, ఎంట్‌క్ చేసి ఉండాలి. నెట్ పాసై ఉండాలి.2జేఆర్ఎఫ్-8అప్టికల్ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్ సైన్స్‌ (Computer Science), మిషన్ లర్నింగ్‌(Machine Learning)లో ఎంఈ, ఎంటెక్ చేసి ఉండాలి. నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.1ఆర్ఏ-1ఫిజిక్స్, ఆప్టిక్స్, అప్లైడ్ ఆప్టిక్స్ లేదా ఆప్టోఎలక్ట్రానిక్స్ ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ(Phd) చేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి.1ఆర్ఏ-2ఫిజిక్స్ లేదా సాలిడ్ స్టేట్ ఫిజిక్స్‌లో ఎంఈ, ఎంటెక్(MTech) చేసి ఉండాలి. మూడేళ్ల సంబంధిత రంగంలో అనుభవం(Experience) ఉండాలి.1

అప్లే చేసే విధానం..

- కేవలం ఆన్‌లైన్ ద్వారానే అప్లికేషన్‌లు స్వీరిస్తారు.
- దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఇస్రో వెబ్‌సైట్‌కి వెళ్లాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
- దరఖాస్తుకు కలర్ ఫోటో, సెమిస్టర్ మార్కుల(Semister Marks) మెమో, నెట్ క్వాలిఫికేషన్ స్కోర్ కార్డు అవసరం
- అప్లికేషన్‌లో పూర్తి సమాచారాన్ని ఇచ్చి సబ్‌మిట్(Submit) చేస్తే రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది.
- పూర్తిగా పూరించని దరఖాస్తులను తిరస్కరించే అధికారం ఇస్రోకు ఉంది.

ఎంపిక విధానం:


1. అభ్యర్థులను ఇంటర్వ్యూ(Interview) ద్వారా ఎంపిక చేస్తారు.
2. అభ్యర్థులు ఆన్‌లైన్‌(Online)లో దరఖాస్తు చేసుకొన్న సమాచారం ప్రకారం అకాడమిక్ పనితీరును పరిశీలిస్తారు.
3. షార్ట్-లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్లు(Call Letters) ఈ-మెయిల్ ద్వారా మాత్రమే పంపుతారు. ఇంటర్వ్యూ ఫలితం తరువాత ఇస్రో వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

0 comments:

Post a Comment

Recent Posts