తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ (తెలంగాణలో 12 స్థానాలకు, ఏపీలో 11 స్థానాలకు) విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణలో 12 స్థానాలకు, ఏపీలో 11 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.....
11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ ప్రకటన- అనంతపురం 1
- కృష్ణా 2
- తూ.గో 1
- గుంటూరు 2
- విజయనగరం 1
- విశాఖ 2
- చిత్తూరు 1
- ప్రకాశం 1
* డిసెంబర్ 10న పోలింగ్.. 14న కౌంటింగ్...
తెలంగాణలోని... ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ ఉండగా...
కరీంనగర్ , మహబూబ్నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఉంది. ఈ నేపథ్యంలోనే.. మొత్తం తెలంగాణలో 12 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అటు ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 16న వెలువడనుండగా... నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కానుంది. ఇక నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ కానుంది. అలాగే.. డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ జరుగనుండగా... డిసెంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు.
0 comments:
Post a Comment