AP Vehicle Life Tax Increases from January 1st 2022
కొత్త ఏడాది వస్తుందంటే క్యాలెండర్ తో పాటు ప్రభుత్వ నిబంధనలు, పలు కీలక అంశాల్లో మార్పులు వస్తుంటాయి.
పన్నురేట్లలో కూడా ప్రభుత్వాలు మార్పులు తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనాల లైఫ్ ట్యాక్స్ లో మార్పులు చేసింది. జనవరి 1 నుంచి కొత్త పన్నులు అమల్లోకి రానున్నాయి.
ఇప్పటివరకు వివిధ వానహనాల రకాలు, ధరల ఆధారంగా లైఫ్ ట్యాక్స్ 9శాతంగా ఉండేది. వచ్చే ఏడాది నుంచి అది మూడు శాతం మేర పెరగనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవాహనాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే పాత వాహనాలకు కూడా నూతన పన్ను వర్తించనుంది.
AP Vehicle Life Tax Increases from January 1st 2022
రూ.50 వేలు అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేసే బైకులకు గతంలో 9శాతం ఉండగా ఇప్పుడు అది 12శాతానికి చేరుకుంది. అలాగే రెండేళ్ల నుంచి 11ఏళ్లు దాటిన వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి తీసుకొస్తే.. వాహనం జీవితకాలాన్ని బట్టి 11 శాతం నుంచి 4శాతం వరకు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
ఇక కొత్త కార్లు, జీపులు, మినీ బస్సుల వంటివి కొనుగోలు చేసినప్పుడు వాటి విలువ రూ.5లక్షల లోపు ఉంటే 13శాతం లైఫ్ ట్యాక్స్ విధిస్తారు. అదే వాహనాల ధర రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే 14 శాతం చెల్లించాలి.
ఇక రూ.20 లక్షల లోపు విలువ చేసే వాహనాలు కొనుగోలు చేసినప్పుడు 17శాతం వరకు పన్ను విధిస్తారు. అదే వాహనాలు రూ.20 లక్షల కంటే ఎక్కువగా ఉంటే 18 శాతం పన్ను చెల్లించాలి. బయటిప్రాంతాల నుంచి తీసుకొచ్చే వాహనాల లైఫ్ ట్యాక్స్ ను కూడా ప్రభుత్వం పెంచింది.
రెండేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న వాహనాలకు వాటి లైఫ్ ఆధారంగా పన్ను విధిస్తారు. ఇక ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఏడేళ్లు దాడి పదేళ్ల లోపు ఉంటే వాటి గ్రీన్ ట్యాక్స్ ను రూ.200 నుంచి రూ.380కి పెంచారు.
0 comments:
Post a Comment