Friday, 3 December 2021

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం. గ్రహణం సమయంలో ఈ పనులు చేయకండి.ఈ పనులు చేయవచ్చు

 నేడు సంపూర్ణ సూర్యగ్రహణం. గ్రహణం సమయంలో ఈ పనులు చేయకండి.ఈ పనులు చేయవచ్చు 

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10:59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది.


మధ్యాహ్నం 3:07 గంటలకు ముగుస్తుంది. నాలుగు గంటలకు పైగా సాగే ఈ గ్రహణం భారత్‌లో ఉన్న ప్రజలకు కనిపించదని నిపుణులు వెల్లడించారు. మన దేశంలో ఏ ప్రాంతంలో కూడా గ్రహణం కనపడదని వారు పేర్కొన్నారు.

దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లోని అన్ని ప్రాంతాల్లో గ్రహణం కనపడుతుంది. అయితే మనకు గ్రహణం కనపించకపోయినా ప్రాచీన కాలంగా ప్రజలు అనుసరిస్తున్న నియమాలు, నమ్మకాలను ఆచరించి తీరాలి. హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణపక్షంలోని మార్గశిర అమావాస్య నాడు ఈ గ్రహణం వస్తోంది.

గ్రహణం సమయంలో ఈ పనులు చేయకండి
✤ గ్రహణం జరుగుతున్న సమయంలో చాకు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. కూరగాయలు, పండ్లను కోయడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే పుట్టే బిడ్డలు వేళ్లు లేకుండా పుడతారని మనదేశంలోని చాలా ప్రాంతాల ప్రజల నమ్మకం
✤ గ్రహణం సమయంలో తినడం, తాగడం, సెక్స్ వంటివి చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. గ్రహణం సమయంలో వండిన ఆహారాలు విషపూరితంగా మారతాయని పూర్వీకుల నమ్మకం.
✤ గ్రహణం సమయంలో పదునైన వస్తువులను వాడకూడదు. ఎందుకంటే పదునైన వస్తువుల ద్వారా ఎవరైనా గాయపడితే తీవ్ర రక్తస్రావం అవుతుందని. తద్వారా ఆ గాయం శాశ్వత మచ్చను కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు

ఈ పనులు చేయవచ్చు
✤ గ్రహణం సమయంలో దానం చేస్తే అది పది లక్షల రెట్ల పుణ్యఫలాలను ఇస్తుందని ప్రజల నమ్మకం
✤ గ్రహణం సమయంలో స్నానం చేసి జంతువులకు ఆహారం పెడితే చాలా మంచిదట

0 comments:

Post a Comment

Recent Posts