త్వరలో మెగా డీఎస్సీ ! ఏపీ లో ఉద్యోగాల భర్తీ పై మంత్రి ఆదిమూలం సురేష్ స్పందన
త్వరలో మెగా డీఎస్సీ ద్వారా లక్ష ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
బూర్జ మండల సర్వసభ్య సమావేశానికి శనివారం ఆయన హాజరై మాట్లాడారు. నాడు-నేడు పనులు కొన్నిచోట్ల అసంపూర్తిగా ఉన్నాయని, సరిగా జరగకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేసి పాఠశాలల్లో ఖాళీలు లేకుండా చేసేందుకు సిద్ధమవుతుంటే, ఇంకా పనులు పూర్తి కాకపోవడమేంటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు.
ఏపీ లో ఉద్యోగాల భర్తీ పై మంత్రి ఆదిమూలం సురేష్ స్పందన
ఏపీ లో ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే జాబ్ క్యాలండర్ కూడా విడుదల చేశామని, ఈ ఉద్యోగాల భర్తీకి ఒక ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి సురేష్ తెలిపారు, ఉద్యోగాల నియామకాలలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ రెసర్వేషన్ లలో అవకతవకలు జరగకుండా అధికారులు చూసుకోవాలని ఆలా జరిగితే వెంటనే కలెక్టర్ కి లేదా మాకు కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సురేష్ తెలిపారు, త్వరలోనే ఉద్యోగ నియామకాలపై అధికార ప్రకటన ఇస్తామని మంత్రి సురేష్ తెలిపారు
Mega dsc excellent
ReplyDelete