Monday, 13 December 2021

Miss Universe 2021 Harnaaz Sandhu

 Miss Universe 2021 Harnaaz Sandhu ::

 ఇజ్రాయెల్‌లో ఆదివారం జరిగిన మిస్ యూనివర్స్ 2021 (Miss Universe 2021) అందాల పోటీలో భారత్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచారు.


అందంతో పాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్ యూనివర్స్ పోటీల్లో 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి మరీ హర్నాజ్ సంధు విశ్వ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. దాంతో విశ్వ సుందరి కిరీటం కోసం 21 ఏళ్లుగా కొనసాగిన నిరీక్షణకు తెరపడింది. అంతకుముందు 1994లో సుష్మిత సేన్ (Sushmita Sen), 2000లో లారా దత్తా (Lara Dutta) మిస్ యునివర్స్‌గా నిలిచారు. విశ్వ విశ్వసుందరిగా నిలిచిన హర్నాజ్ సంధుకు శుభాకాంక్షలతో పాటు ప్రశంసలు అందుతున్నాయి.


మిస్ యూనివర్స్ 2021గా నిలిచిన హర్నాజ్ కౌర్ సంధు (Harnaaz Sandhu)కు బాలీవుడ్ హీరోయిన్ లారా దత్తా (Lara Dutta) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'మిస్ యునివర్స్‌గా నిలిచిన హర్నాజ్ కౌర్ సంధుకు శుభాకాంక్షలు. మా క్లబ్‌లోకి స్వాగతం. ఈ సమయం కోసం 21 సంవత్సరాలు వేచిచూస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసారు. శతకోటి కలలు నిజమయ్యాయి' అని లారా దత్తా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. MissDivaOrg, MissUniverse అనే హ్యాష్ టాగ్స్ కూడా జతచేశారు.

17 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్ ప్రారంభించిన 21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు (Harnaaz Sandhu) ఇప్పటివరకు నాలుగు బ్యూటీ కాంటెస్ట్‌లలో విజేతగా నిలిచారు. 2017లో 'టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్', 2018లో 'మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్', 2019లో 'ఫెమినా మిస్ ఇండియా పంజాబ్', 2021లో 'మిస్ యూనివర్స్ ఇండియా' కితాబులను అందుకున్నారు. మిస్ యునివర్స్‌గా నిలిచిన తర్వాత హర్నాజ్ సంధు కన్నీటిపర్యంతం అయ్యారు. తన ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చేశారు.

స్కూల్ డేస్‌లలో హర్నాజ్ కౌర్ సంధు (Harnaaz Sandhu) చాలా సన్నగా ఉండేవారట. దాంతో ఆమె స్నేహితులు ఏడ్పించేవారట. ఆ సూటిపోటి మాటలతో హర్నాజ్ సంధు డిప్రెషన్‌కు గురయ్యారట. ఆ సమయంలో హర్నాజ్ కుటుంబం అండగా నిలవడంతో ఆమె త్వరగా కోలుకున్నారు. ఆపై పట్టుదలతో మోడలింగ్ కెరీర్ ఆరంభించి.. అందాల పోటీలలో విజేతగా నిలిచారు. అయితే మిస్ యునివర్స్‌గా నిలిచిన ఈ అందాల భామ డైటింగ్ మాత్రం చేయరట. తనకు నచ్చినవి, నోటికి రుచిగా ఉండేవి అన్నీ తింటారట. అయితే రోజూ వర్కౌట్స్ తప్పనిసరిగా చేయడమే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్ అట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


0 comments:

Post a Comment

Recent Posts