Tuesday, 11 January 2022

IARI Job Notification 2022 టెన్త్ అర్హతతో భర్తీ చేస్తున్న 641 ఉద్యోగాలకు అప్లై చేయడానికి మరో 10 రోజులు గడువు

IARI Job Notification 2022 టెన్త్ అర్హతతో భర్తీ చేస్తున్న 641 ఉద్యోగాలకు అప్లై చేయడానికి మరో 10 రోజులు గడువు

 టెన్త్ పాస్ అయినవారికి అలర్ట్. టెన్త్ అర్హతతో భర్తీ చేస్తున్న 641 ఉద్యోగాలకు అప్లై చేయడానికి మరో 10 రోజులు గడువుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు (ICAR) చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) ఓ జాబ్ నోటిఫికేషన్ ( Job Notification ) ద్వారా 641 టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.


ఈ పోస్టులకు గత నెలలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2022 జనవరి 10 చివరి తేదీ అని ముందుగానే నోటిఫికేషన్‌లో వెల్లడించింది IARI. ఈ గడువు ముగియడంతో అప్లికేషన్ డెడ్‌లైన్‌ను పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జనవరి 20 లోగా దరఖాస్తు చేయొచ్చు.


ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) భర్తీ చేస్తున్న 641 పోస్టుల్లో హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్స్‌లో 25 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ అర్హతతో భర్తీ చేస్తున్న టెక్నీషియన్ పోస్టులు ఇవి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.


IARI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు641అన్‌రిజర్వ్‌డ్286ఈడబ్ల్యూఎస్61ఎస్‌సీ93ఎస్‌టీ68ఓబీసీ133


IARI Recruitment 2022: హైదరాబాద్‌లోని ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు25ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్8ఐసీఏఆర్- సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, హైదరాబాద్6ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, హైదరాబాద్6ఐసీఏఆర్- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్2ఐసీఏఆర్- డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్, హైదరాబాద్2ఐసీఏఆర్- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మీట్, హైదరాబాద్1


IARI Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  • దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 18
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 20 రాత్రి 11.45 గంటల వరకు
  • పరీక్ష తేదీ- 2022 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5


విద్యార్హతలు- టెన్త్ పాస్ కావాలి

వయస్సు- 2022 జనవరి 10 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.700 ఎగ్జామ్ ఫీజు, రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించాలి.

వేతనం- రూ.21,700 బేసిక్ వేతనంతో పాటు ఏడో పే కమిషన్ లెవెల్ 3 ఇండెక్స్ 1 అలవెన్సులు లభిస్తాయి.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ ఎగ్జామ్

పరీక్షా విధానం- 100 ప్రశ్నలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.


IARI Recruitment 2022: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు https://www.iari.res.in/ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో టెక్నీషియన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Step 2- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. నియమనిబంధనలన్నీ చదివి PROCEED TO REGISTER పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత పోస్టు పేరు సెలెక్ట్ చేయాలి.

Step 4- అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 5- ఆ తర్వాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

Step 6- విద్యార్హతలు, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

Step 7- ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.


0 comments:

Post a Comment

Recent Posts