Indian Navy Senior Secondary Recruitment 2022 Notification Online Apply
ఇండియన్ నేవీ (Indian Navy) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ (SSR) ద్వారా అగ్నివీర్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.
FA 2 All subjects Key Sheets in pdf Download
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు (Job Application) చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 08 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1400 పోస్టులు భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ.
అగ్నివీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభమయ్యే 01/2023 (మే 23) బ్యాచ్ పేరుతో శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35500, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.
వివరాలు..
* అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్)
మొత్తం ఖాళీల సంఖ్య: 1400 పోస్టులు (మెన్-1120, ఉమెన్-280)
ఇండియన్ నేవీ SSR రిక్రూట్‌మెంట్ 2022 (Indian Navy SSR Recruitment 2022)
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ - 08 డిసెంబర్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 17 డిసెంబర్
మొత్తం పోస్టుల సంఖ్య - 1400
అర్హత ప్రమాణాలు:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఇతర అర్హతలు: కనిష్ఠ ఎత్తు - పురుషులు 157 సెం.మీ., స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.
వయోపరిమితి:
అభ్యర్థులు తప్పనిసరిగా 01 మే 2002 - 31 అక్టోబర్ 2005 మధ్య జన్మించి ఉండాలి.
ఇండియన్ నేవీ SSR రిక్రూట్‌మెంట్ 2022 (Indian Navy SSR Recruitment 2022)
పరీక్ష రుసుము:
అభ్యర్థులకు దరఖాస్తు ఫీజుగా రూ. 550/- చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
- షార్ట్‌లిస్టింగ్ (కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష)
- రాత పరీక్ష
- PFT & ప్రిలిమినరీ మెడికల్
- ఫైనల్ రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామ్
పరీక్ష విధానం:మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. హిందీ/ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
శిక్షణ:అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది మే నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment