Tuesday, 29 November 2022

KVS Teacher Jobs Notification 6,990 TGT, PGT Posts Notification and 6414 Primary Teacher Posts Full Details

KVS Teacher Jobs Notification 6,990 TGT, PGT Posts Notification Full Details 

Teacher Jobs-Full Details: టీచర్ ఉద్యోగాలకు రెండు భారీ నోటిఫికేషన్లు.. 13,404 ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం..

కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) నుంచి రెండు భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో 6414 ఖాళీలతో ప్రైమరీ టీచర్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదల కాగా..

FA 2 All subjects Key Sheets in pdf Download

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

6,990 TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇలా మొత్తం రెండు నోటిఫికేషన్ల నుంచి 13, 404 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు KVS అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ప్రైమరీ పోస్టుల వివరాలు ఇలా..

ప్రైమరీ టీచర్ పోస్టులు 6414 ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభం అయి.. డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను www.kvsangathan.nic.in. సందర్శించొచ్చు.

అర్హతలు..

50 శాతం మార్కులతో 10+2 ఇంటర్మీడియట్ & CTET పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. B.Ed చేసిన అభ్యర్థి కూడా దీనికి అర్హులు (కోర్టు ఆధారంగా తుది నిర్ణయం ఉంటుంది



కేటగిరీల వారీగా పోస్టులు

జనరల్ - 2599

ఓబీసీ -1731

ఎస్సీ - 962

ఎస్టీ - 481

ఈబ్ల్యూఎస్ - 641

ఓహెచ్ - 97

వీహెచ్ - 96

మొత్తం పోస్టుల సంఖ్య - 6414


Click here to Download Primary Teachers Recruitment Notification

Download Syllabus for Primary TGT PGT Posts 

మరో నోటిఫికేషన్ లో..

కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) నుంచి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6990 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మొత్తం పోస్టుల సంఖ్య.. 6990

1. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 52

అర్హతలు: B.Ed మరియు సంబంధిత ఫీల్డ్ అనుభవంతో PG డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2. ప్రిన్సిపల్ పోస్టులు 239

అర్హతలు: 45 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ అండ్ 15 సంవత్సరాల అనుభవంతో B.Ed పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

3. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 203

అర్హతలు: 45% మార్కులతో మాస్టర్ డిగ్రీ & 05 సంవత్సరాల అనుభవంతో B.Ed పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు - 1409

అర్హతలు: సంబంధిత సబ్జెక్ట్‌లో 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ & B.Ed పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

5. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు - 3176

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ & CTET పరీక్ష ఉత్తీర్ణత మరియు B.Ed పరీక్ష ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

6. లైబ్రేరియన్ పోస్టులు - 355

అర్హతలు: లైబ్రరీ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ లేదా లైబ్రరీ సైన్స్‌లో 1 సంవత్సరం డిప్లొమా డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

7. ప్రైమరీ టీచర్స్ (మ్యూజిక్) - 303

అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 ఇంటర్మీడియట్ & సంగీతంలో డిగ్రీ ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


8. ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు - 06

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Com / M.Com / CA / MBA డిగ్రీ ఉండాలి.

9. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు - 02

అర్హతలు: సివిల్ ఇంజనీర్‌లో బిఇ / బి.టెక్ / డిప్లొమా చేసి ఉండాలి.

10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు - 156

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

11. హిందీ ట్రాన్స్ లేటర్ - 11

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హిందీ/ఇంగ్లీషులో పీజీ డిగ్రీ ఉండాలి.

12. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు - 322

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు - 702

అర్హతలు: టైపింగ్‌తో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణులయి ఉండాలి. వీటితో పాటు.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు - 54

అర్హతలు: స్టెనోలో డిగ్రీతో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణులయి ఉండాలి.

సబ్జెక్ట్ వారీగా టీజీటీ(TGT) ఖాళీలు..

సబ్జెక్ట్ఖాళీలుహిందీ377ఆంగ్లం401సంస్కృతం245సోషల్ స్టడీస్398గణితం426సైన్స్304P & HE435ఆర్ట్ ఎడ్యుకేషన్251WE339

సబ్జెక్ట్ వారీగా పీజీటీ(PGT) ఖాళీలు..

సబ్జెక్ట్ఖాళీలుహిందీ172ఆంగ్లం158భౌతిక శాస్త్రం135రసాయన శాస్త్రం167గణితం184జీవశాస్త్రం151హిస్టరీ63భౌగోళిక శాస్త్రం70ఆర్థిక శాస్త్రం97కామర్స్66కంప్యూటర్ సైన్స్142బయో-టెక్04

దరఖాస్తు ఫీజు..

ప్రిన్సిపల్ పోస్టులకు .. జనరల్ / OBC : రూ.1200

TGT/PGT/PRT పోస్టుల కోసం : Gen / OBC : రూ.750

SC / ST / PH : నిల్

ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించొచ్చు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం : 05-12-2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-12-2022

పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 26-12-2022 


Click here to Download complete Notification

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్చేసిచేసి తెలసుకోండి.

For More Details Notification Online application link

KVS Teacher Jobs Notification 6,990 TGT, PGT Posts Notification Full Details

0 comments:

Post a Comment

Recent Posts