Thursday, 8 December 2022

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా (Central Government Jobs) ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

 Central Government Jobs : కేంద్రంలో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. కేంద్ర మంత్రి చెప్పిన పూర్తి లెక్కలివే!

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా (Central Government Jobs) ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.


ఇందులో గ్రూప్‌-ఏకు సంబంధించి 23,584 పోస్టులు, గ్రూప్‌-బీకి సంబంధించి 1,18,807, గ్రూప్‌-సీ 8,36,936 ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరాలకు సంబంధించి పలువురు పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ (Jitendra Singh) వివరాలు వెల్లడించారు. మొత్తం ఖాళీల్లో రైల్వేకు సంబంధించి 2,93,943, రక్షణ రంగంలో (సివిల్‌) 2,64,704, హోం మంత్రిత్వశాఖలో 1,43,536 ఖాళీలు (Jobs) ఉన్నాయని వెల్లడించారు. 



మార్చి 1, 2021 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 40,35,203 పోస్టులు మంజూరయ్యాయన్నారు. వాటిలో ఇప్పటివరకు 30,55,876 ఖాళీలు భర్తీ అయినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

 'రోజ్‌ గార్‌ మేళా'లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నామన్నారు. ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయంలో (PMO) మొత్తం 446 పోస్టులు ఉండగా.. 129 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు.

 రాష్ట్రపతి సెక్రటేరియట్ లో 380 పోస్టులకు గానూ.. 91 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 1.47లక్షల మందికి నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ (CSS)లోని సెక్షన్‌ ఆఫీసర్ల కేడర్‌లో కొరత ఉందన్నారు

సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ (CSS), సెంట్రల్‌ సెక్రటేరియట్‌ స్టెనోగ్రాఫర్స్‌ సర్వీస్‌ (CSSS), సెంట్రల్‌ సెక్రటేరియట్‌ క్లరికల్‌ సర్వీస్‌ (CSCS)లకు సంబంధించి జులై 2022 నాటికి 8వేల మంది ప్రమోషన్లు పొందారన్నారు. 

2013 నుంచి ఆగిపోయిన అనేక ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు చెప్పారు. అయితే.. కోర్టుల పరిధిలో ఉన్న ప్రమోషన్లను మాత్రమే పెండింగ్ లో ఉంచినట్లు వివరించారు.


/p>https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-9493837139455755

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా (Central Government Jobs) ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

0 comments:

Post a Comment

Recent Posts