AP DMB Jobs 2022: నెలకు రూ.85 వేల జీతంతో.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీల్లో 1458 పోస్టులు..
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో.. 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
జనరల్ మెడిసిన్, అనెస్తీషియా, రెస్పికేటరీ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎమ్/ఎమ్‌సీహెచ్/ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/ఎమ్‌డీఎస్ లేదా నేషనల్ మెడికల్ కౌన్సెలింగ్ గైడ్‌లైన్స్‌లో పొందుపర్చిన తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారు రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సిఉంటుంది.
అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్ పోస్టులకు రూ.85,000లు, రెసిడెంట్ స్పెషలిస్ట్ పోస్టులకు రూ.70,000లు, రెసిడెంట్ డెంటిస్ట్ పోస్టులకు రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
0 comments:
Post a Comment