ap jobs : 957 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ-నోటిఫికేషన్ విడుదల-దరఖాస్తు చేసుకోండిలా!
Aపీలో ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా 957 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసింది.
వైద్య ఆరోగ్య శాఖలో 957 స్టాఫ్ నర్స్ పోస్టుల నియామకానికి ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టూ ఖాళీగా ఉండకూడదన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.
హెల్త్ డైరెక్టర్, ఏపీ వైద్యవిధాన పరిషత్ పరిధిలో 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏడాది కాల పరిమితికి గాను కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపారు.
వైద్యారోగ్యశాఖలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం వివరాలు కూడా ప్రకటించారు.
http://cfw.ap.nic.in వెబ్సైట్ లో ఈనెల 2 నుండి 8వ తేదీ వరకు అప్లికేషన్ ప్రొఫార్మా అందుబాటులో ఉంచుతున్నారు.
వెబ్సైట్ నుండి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన అప్లికేషన్లను డిసెంబర్ 9లోగా అయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల అడ్రస్ లను కూడా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
విశాఖపట్నం ఆర్డీ కార్యాలయం: రీజనల్ డైరెక్టర్, బుల్లయ్య కాలేజీ ఎదురుగా, రేసపువానిపాలెం
రాజమండ్రి ఆర్డీ కార్యాలయం: జిల్లా ఆసుపత్రి ప్రాంగణం , రాజమండ్రి
గుంటూరు ఆర్డీ కార్యాలయం: పాత ఇటుకులబట్టి రోడ్ , అశ్విని ఆసుపత్రి వెనుక, గుంటూరు
వైఎస్సార్ కడప ఆర్డీ కార్యాలయం: పాత రిమ్స్ ప్రాంగణం, కడప
జోన్ల వారీగా ఖాళీల వివరాల కోసం http://cfw.ap.nic.in?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH వెబ్సైట్ ను చూడొచ్చు
0 comments:
Post a Comment