Friday, 30 December 2022

APPSC Group 1 Exam Date: జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష.. హాల్‌టికెట్లు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

APPSC Group 1 Exam Date: జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష.. హాల్‌టికెట్లు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

 ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపీపీఎస్సీ) 92 గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్‌ 5తో ముగిశాయి.

ఇక గ్రూప్‌ 1 నియామక ప్రక్రియలో మొదటి దశ అయిన ప్రిలిమ్స్‌ పరీక్ష జనవరి 8న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది.

 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు డిసెంబర్‌ 31 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో పేపర్‌ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుంది. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఇతర వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Group-2 నోటిఫికేషన్‌ జారీ.. కొలువులు ఎన్నంటే..!

APPSC Group 1 Exam Date: జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష.. హాల్‌టికెట్లు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

0 comments:

Post a Comment

Recent Posts