BF.7 Variant: బీఎఫ్.7 వేరియంట్ శరీరంలోని ఏ భాగాలపై దాడి చేస్తుంది, రక్షణ చర్యలు ఏం తీసుకోవాలి.
ప్రపంచాన్ని ఇంతలా భయపెడుతున్న బీఎఫ్.7 వేరియంట్ శరీరంలోని ఏ భాగాలపై దాడి చేస్తుంది, కాపాడుకునేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం.
బీఎఫ్.7 కరోనా వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్.
దీనిని BA.5.2.1.7గా పిలుస్తారు. ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.7 సబ్ వేరియంట్ ఇంది.
చైనాలో కరోనా కేసులు పెరగడానికి కారణం ఇదే. చైనాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ వేరియంట్ ఉంది. ఇప్పటికే ఇండియాలో ఈ వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. వడోదరలో ఓ మహిళకు ఈ వేరియంట్ నిర్ధారణైంది.
బీఎఫ్.7 అంత ప్రమాదకరం కాదు కానీ ఇతర వేరియంట్లతో పోలిస్తే చాలా వేగంగా విస్తరిస్తుంది. ఎక్కువమందికి ఈ వ్యాధి సోకుతుంది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి సైతం ఈ వేరియంట్ సోకుతుండటం విశేషం. ఈ వేరియంట్ కారణంగా బ్రోంకైటిస్, నిమోనియా, టీబీ, ఫ్లూ వంటి వ్యాధులు తలెత్తుతాయి.
శరీరంలోని ఏ భాగాలపై దాడి చేస్తుంది
బీఎఫ్.7 ప్రధానంగా చెవులు, ముక్కులు, సైనస్, గొంతు, కంఠం, శ్వాస వాహిక, ఊపరితిత్తులకు సంక్రమిస్తుంది.
ఈ అంగాలపై దాడి చేసినప్పుడు జలుబు, టాన్సిలైటిస్, సైనస్, గొంతులో గరగర, ముక్కు కారడం, తుమ్ములు, తలనొప్పి, కండరాల నొప్పి ప్రధాన లక్షణాలుగా కన్పిస్తాయి.
ఏం చేయాలి
లిక్విడ్ ఫుడ్స్ అయిన నీరు, జ్యూస్, సూప్, వేడి నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి. చికెన్ సూపర్ కూడా ప్రయోజనకరం.
కెఫీన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. దగ్గు, జ్వరం ఉన్నప్పుడు విశ్రాంతి ఎక్కువగా ఉండాలి. ఇలా చేస్తే త్వరగా నయం కావడమే కాకుండా..ఇతరులకు సంక్రమించే ముప్పు తగ్గుతుంది.
Corona Virus: ఈ ఆహారాలు తినడం కరోనాను ఆహ్వానించినట్లే.. తస్మాత్ జాగ్రత్త..!
0 comments:
Post a Comment