లాక్ డౌన్ పరిస్థితి రాదు భారతీయుల్లో రోగనిరోధక శక్తి ఉంది
ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానానికి మారాలి
పౌరులంతా కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలి
భారత వైద్య సంఘం సభ్యుడు డా.అనిల్ గోయల్
న్యూఢిల్లీ: ఇప్పటికే దేశ జనాభాలో అర్హులైన వారిలో 95 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయి న నేపథ్యంలో, మళ్లీ లాక్ డౌన్ వంటి పరిస్థితి తలెత దని భారత వైద్య సంఘానికి చెందిన డాక్టర్ అనిల్ గోయల్ కీలక ప్రకటన చేశారు.
భారతీయుల రోగనిరోధక శక్తి చైనీయుల కంటే అధికంగా ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో భార త్ తప్పనిసరిగా మళ్లీ టెస్టింగ్, ట్రేసిం గ్, ట్రీటింగ్ విధానానికి మారాలని సూచించారు.
ఇప్పటికే దేశంలో 200కిపైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని గుర్తుచేశారు.
పౌరులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది.
ఐఎంఎ మార్గదర్శకాలు
బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
భౌతిక దూరం పాటించాలి. చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. * వివాహ వేడుకలు, రాజకీయ లేదా సాంఘిక సమావేశాలకు దూరంగా ఉండాలి.
విదేశీ ప్రయాణాలను మానుకోవాలి.
* గొంతు నొప్పి, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. * సత్వరమే కోవిడ్ టీకాలను తీసుకోవాలి. అవసరమైతే బూస్టర్ను తీసుకోవాలి.
> ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలి.
0 comments:
Post a Comment