ఈ పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే ఎంత వేలాడే పొట్ట అయినా నెల రోజుల్లో మాయం..!
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
సాధారణంగా కొందరి శరీరం మొత్తం సన్నగా ఉన్న పొట్ట వద్ద మాత్రం లావుగా ఉంటుంది. గంటల తరబడి కూర్చుని ఉండటం, ఒత్తిడి, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, మద్యపానం, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోతుంటుంది.
దీంతో నాజుగ్గా ఉండాల్సిన పొట్ట లావుగా తయారవుతుంది. ఈ క్రమంలోనే పొట్ట వద్ద కొవ్వును కరిగించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే కనుక ఎంత వేలాడే పొట్ట అయినా సరే నెల రోజుల్లోనే మాయమవుతుంది.
మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ డ్రింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అర అంగుళం అల్లం ముక్కలు తీసుకుని తొక్క తొలగించి వాటర్ లో కడిగి సన్నగా తురుముకోవాలి. అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అల్లం తురుము, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఆరు నుంచి ఎనిమిది లవంగాలు వేసి కనీసం పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల తరిగిన పార్స్లీ ఆకులు వేసి బాగా కలిపి మూత పెట్టి అరగంట పాటు వదిలేయాలి.
అనంతరం స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపితే మన డ్రింక సిద్దమవుతుంది. రోజుకు ఒకసారి ఈ పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే కనుక పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. వేలాడే పొట్ట టైట్ గా మరియు నాజూగ్గా మారుతుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు. కాబట్టి బాన పొట్టతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి. మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
0 comments:
Post a Comment