Monday, 26 December 2022

వెన్నునొప్పి నడుం నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఇంటిలోనే సహజ పద్ధతిలో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Praస్తుత కాలంలో మన ఆహారపు అలవాట్లలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవడం అలాగే పని ఒత్తిడి కారణంగా గంటల తరబడి కూర్చొని పనిచేయటం వల్ల చిన్న వయసు వారే నడుమునొప్పి వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు.


ఇలా వెన్నునొప్పి నడుం నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఇంటిలోనే సహజ పద్ధతిలో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఇక ఇలాంటి సమస్యతో బాధపడే వారు వెల్లుల్లితో ఇలా కనుక చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆయుర్వేద శాస్త్రంలో వెల్లుల్లిని పెయిన్ కిల్లర్ గా భావిస్తారు. వెల్లుల్లిలో ఎసిలిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి దోహదపడుతుంది.



ఈ క్రమంలోనే నడుం నొప్పి వెన్నునొప్పి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను పరగడుపున తినడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

అయితే చాలామంది ఈ వెల్లుల్లి రెబ్బలను తినడానికి ఇష్టపడరు అయితే ఇలా ఇష్టపడని వారు తేనెతో కలిపి తీసుకోవడం ఎంతో మంచిది.

వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం లేదా వాటిని మెత్తగా పేస్ట్ చేసి తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. 

ఇకపోతే వెల్లుల్లి కట్ చేసిన ఐదు నిమిషాల తర్వాత తీసుకోవడం మంచిది.

ఇలా కూడా తినలేని వారు పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తని మిశ్రమంలా తయారుచేసి ఇందులో నుంచి తీసిన రసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల వెన్ను నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా మన ఇంటిలో దొరికే వెల్లుల్లి ద్వారా సహజ పద్ధతిలో వెన్ను నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు.


వెన్నునొప్పి నడుం నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఇంటిలోనే సహజ పద్ధతిలో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

0 comments:

Post a Comment

Recent Posts