చెవినొప్పి వేధిస్తోందా? అయితే కారణం ఇదే అయ్యుంటుంది
దిశ, ఫీచర్స్: అసలే వింటర్ సీజన్.. చలి తీవ్రత లేదా చల్లటి గాలులవల్ల చెవి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువుంటాయి అంటున్నారు ఈఎన్టీ నిపుణులు.
ఈ సీజన్‌లో జలుబు, జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గర గర వంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే ఎక్కువగా చెవి నొప్పి సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి.
తరచూ చలిగాలుల మధ్య పనిచేయాల్సి రావడంవల్ల చెవి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే టూ వీలర్‌పై గానీ, ఇతర వాహానాల్లో గానీ జర్నీ చేసేటప్పుడు చల్లటిగాలి చెవిలో చొరబడటంవల్ల చెవి నొప్పి, చెవిపోటు వంటివి వచ్చే చాన్స్ ఎక్కువ.
అయితే వింటర్‌లో తలెత్తే చెవి సమస్యలన్నీ ఈ సీజన్ కారణంగానే వస్తాయా? అంటే.. దాదాపు ఎక్కువ సీజనల్ ఎఫెక్టే అయి ఉంటుంది.
అదే విధంగా గతం నుంచి కొనసాగుతూ వస్తున్న చెవి సమస్యలు కూడా ఈ కాలంలో పెరుగుతాయి. అరుదుగా ఇతర కారణాలు కూడా Requirements.
సమస్య తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
తరచూ వచ్చే సమస్యలు :
* ఇన్ఫెక్షన్ : చలికాలంలో చెవి ఇన్ ఫెక్షన్ పిల్లల్ని, పెద్దల్ని వేధిస్తుంది. చాలాసార్లు జలుబు ఉన్నవారిలో ఇవి తలెత్తుతుంటాయి. చెవిని గొంతుతో కలిపే యుస్టాచియన్ ట్యూబ్ ద్వారా బ్యాక్టీరియా చెవికి వెళ్లడం కారణంగా ఈ సమస్య వస్తుంది.
వింటర్‌లో చెవి నొప్పి ఇన్ఫెక్షన్‌కు ఇది ప్రధాన కారణం. ఈ ఇన్ ఫెక్షన్ వల్ల చెవినుంచి ద్రవంలాంటిది కారుతూ దుర్వాసన వెదజల్లుతుంది.
* ముక్కులో ఇబ్బంది: లేదా మూసుకు పోయిన ఫీలింగ్ : గొంతును, చెవిని కలిపే యుస్టాచియన్ ట్యూబ్‌లో చిక్కటి ద్రవం లాంటి పదార్థం పేరుకుపోవడం, లేదా అది ఘనీభవించి ఉండటంవల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. చలికాలంలోనే ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది.
అంతేగాక జలుబు, దగ్గు, తుమ్ముల కారణంగా చెవి లోపలి భాగంలో, సిరల్లో ఒత్తిడి కలిగి చెవిపోటు లేదా నొప్పి కలుగుతుంది. అందుకే దగ్గు, జలుబు వంటివి కూడా ఐదారు రోజులకు మించి తగ్గకుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్.
*సైనస్: చలికాలంలో చాలామందిని బాధించే సమస్య ఇది. అలర్జీల వల్ల తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఫలితంగా చెవిలో నొప్పి ప్రారంభం కావచ్చు.
* నరాలపై ప్రభావం : చలిగాలులు చెవిని తాకి, లేదా చెవి రంద్రంలోకి ప్రవేశించి సున్నితమైన నరాలు ప్రభావితం చేస్తాయి. అందుకే తుఫానులు, చల్లటి గాలులు వీస్తున్నప్పుడు చాలామంది చెవి సమస్యను ఎదుర్కోవడం కనిపిస్తూ ఉంటుంది.
ఇటువంటి వాతావరణంలో బయటకు వెళ్లేవారు చెవులను మూసి ఉంచే చర్యలు తీసుకోవాలి. అంటే.. వెచ్చటి రుమాలు కట్టుకోవడమో, క్యాప్ పెట్టుకోవడమో చేయాలి. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా మసలు కోవాలి అంటున్నారు ఈఎన్టీ నిపుణులు.
0 comments:
Post a Comment