యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ఈ జ్యూస్ సేవిస్తే అద్భుత ఫలితం మీ సొంతం!
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
తీగజాతి కాయకూరల్లో సొరకాయకు ప్రత్యేక స్థానం ఉంది.సహజ సిద్ధంగా లభించే సొరకాయలో అధిక శాతం నీరు, ఫైబర్ తో నిండి ఉండి మన శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షించడంతోపాటు శరీర జీవక్రియలను క్రమబద్దీకరించడంలో కూడా సహాయపడుతుంది.
అలాగే ఒక గ్లాసుడు సొరకాయ జ్యూస్ లో 25 మిల్లీ గ్రాముల విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది కావున ప్రతిరోజు ఉదయాన్నే సొరకాయ జ్యూస్ ను సేవిస్తే ఇందులో లభించే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే ప్రమాదకర జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తుంది.
సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటూ తరచూ
సొరకాయ కూర, సలాడ్స్,సొరకాయ హల్వా, వడియాలు ఇలా ఎన్నో రకాలుగా మన ఆహారంలో భాగం చేసుకుంటే మన జీవక్రియలకు అవసరమైన విటమిన్ కాంప్లెక్స్, విటమిన్ కె , రైబోఫ్లెవిన్, జింక్, థయామిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా చక్కెర వ్యాధిగ్రస్తులు సొరకాయను తినడం వల్ల సొరకాయలో ఉన్న ఔషధ గుణాలు, ఫైబర్ క్లోమం పనితీరును మెరుగుపరిచి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి చక్కెర వ్యాధి నీ అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. వేసవికాలంలో సొరకాయ జ్యూస్ ను క్రమం తప్పకుండా సేవిస్తే ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడతాయి
సొరకాయలు పొటాషియం ,మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి హై బీపీ, లో బిపి సమస్యలను కంట్రోల్ చేస్తుంది. సొరకాయ జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం, ఉబ్బసం, గ్యాస్టిక్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నియంత్రించవచ్చు.సొరకాయ జ్యూస్ లో నిమ్మరసం, తేనె పరగడుపున సేవిస్తే కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు వంటి అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.సొరకాయ రసంలో అల్లం రసాన్ని కలుపుకొని అల్పాహారాన్ని కంటే ముందే సేవిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి గుండె పోటు ముప్పును తగ్గిస్తుంది.
0 comments:
Post a Comment