CBSE Board Exams 2023: జనవరి 1 నుంచి సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు..
విద్యార్థులకుముఖ్యమైనసూచనలు
CBSE Board Practical Exams 2023: 10, 12 తరగతుల విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభ తేదీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది.
సీబీఎస్ బోర్డ్ పరీక్షలు 2022-2023 (CBSE Board Exams 2023) కు సంబంధించిన.. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం ముఖ్యమైన నోటీస్‍ను విడుదల చేసింది.
10,12 క్లాసులకు 2023 జనవరి 1వ తేదీ (వచ్చే నెల) నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని చెప్పింది.
సీబీఎస్ఈ అధికారిక వెబ్‍సైట్ cbse.gov.inలో విద్యార్థులు అఫీషియల్ నోటీస్‍ను చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రాక్టికల్ పరీక్షల కోసం విద్యార్థులకు కీలకమైన సూచనలు చేసింది సీబీఎస్ఈ.
CBSE Board Exams 2023: ప్రాక్టికల్ ఎగ్జామ్స్/ఇంటర్నల్ అసెస్‍మెంట్ కోసం 10, 12 తరగతుల విద్యార్థులు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలను సీబీఎస్ఈ సూచించింది. పాఠశాలలకు కూడా మార్గదర్శకాలు జారీ చేసింది.
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు
CBSE Board Exams 2023: పాఠశాలలు ఇచ్చే లిస్టులో.. అభ్యసిస్తున్న సబ్జెక్టులు కరెక్టుగా ఉన్నాయో లేదో విద్యార్థులు తప్పకుండా చెక్ చేసుకోవాలని సీబీఎస్ఈ సూచించింది.
ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే సబ్జెక్టులకు సంబంధించి పూర్తి సిలబస్, సబ్జెక్టుల గురించి విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీబీఎస్ఈ చెప్పింది.
షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు తప్పకుండా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలని, ఎందుకంటే రెండో అవకాశం ఉండదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
CBSE Board Exams 2023: కాగా, ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభంలోగా సంబంధిత సిలబస్‍ను పూర్తి చేసి, విద్యార్థులను సంసిద్ధంగా ఉంచాలని పాఠశాలలకు సీఈబీఎస్ఈ సూచనలు చేసింది.
పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని, ప్రాక్టికల్ ఆన్సర్స్ బుక్‍లను సరిపడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. ఏవైనా సమస్యలు ఉంటే వీలైంత త్వరగా నేరుగా రీజనల్ ఆఫీస్‍ను సంప్రదించవచ్చని పాఠశాలలకు సీబీఎస్ఈ సూచనలు చేసింది.
0 comments:
Post a Comment