Tuesday 27 December 2022

Curd vs Buttermilk: పెరుగు, మజ్జిగలో ఇన్ని తేడాలు ఉన్నాయా? మరి ఏది ఆరోగ్యానికి చాలా మంచిది..

Curd vs Buttermilk: పెరుగు, మజ్జిగలో ఇన్ని తేడాలు ఉన్నాయా? మరి ఏది ఆరోగ్యానికి చాలా మంచిది..
మన సంప్రదాయ వంటకాలలో పెరుగుకు అధిక ప్రాధాన్యం ఉంది. ఎదురుగా ఎన్ని వెరైటీలున్నా..


చివరిగా ఒక రెండు ముద్దలు పెరుగుతో గొంతు దిగనిదే సంతృప్తి ఉండదు. అయితే పెరుగుతో పాటు మజ్జిగకు మన ఇంట్లో మంచి ప్రాధాన్యమే ఉంటుంది.

మరి పెరుగు, మజ్జిగల్లో ఏది ఉత్తమం? ఏది శరీరానికి అధిక మేలు చేకూరుస్తుంది? రెండింటి మధ్య పోలికలు ఏంటి? నిపుణులు ఈ రెండింటి గురించి ఏమి చెబుతున్నారు? ఒక సారి చూద్దాం..మజ్జిగే మంచిదా..?

సాధారణంగా చాలా మంది నిపుణులు పెరుగుతో పోల్చితే మజ్జిగే మంచిదని చెబుతుంటారు. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ తేలికగా అరిగిపోవడంతో పాటు అన్ని రకాల శరీర తత్వాలకు ప్రయోజనకారిగా ఉంటుంది.

అయితే పెరుగు నుంచే మజ్జిగ తయారవుతుంది. అయినప్పటికీ పెరుగు కంటే మజ్జిగ ఎందుకు ఉత్తమం? ఇప్పుడు చూద్దాం..

మజ్జిగ చలవ చేస్తుంది..

డాక్టర్ డింపుల్ జంగ్డా అనే ఆయుర్వేద వైద్యురాలు తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో దీనిపై వివరంగా మాట్లాడారు.

పెరుగు శరీరానికి అధిక వేడిని కలుగజేస్తుందన్నారు. కానీ మజ్జిగతో మాత్రం శరీరానికి చలవ చేస్తుందని చెప్పారు. అదేంటి రెండింటి ధాతువు ఒకటే అయినప్పుడు.. రెండూ వేర్వేరు ప్రయోజనాలు ఎలా చేకూరుస్తుంది? దీనిపై ఆమె సమాధానం ఇస్తూ.. పెరుగులో అధిక సంఖ్యలో ఉండే బాక్టీరియాల కారణంగా శరీరానికి వేడిని కలుగజేస్తాయి.

మనం ఎప్పుడైతే పెరుగును తీసుకుంటామో.. అది కడుపులో చేరి జీర్ణక్రియను ప్రోత్సహిస్తోంది. దానిలోని బాక్టీరియా కడుపులో చేరి వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది.


ఫలితంగా శరీరానికి వేడిని కలుగజేస్తుంది. అయితే ఇదే విధానంలో మజ్జిగను పరిశీలించినప్పుడు వేరే ఫలితాలు వస్తాయని ఆమె వివరించారు. ఎందుకంటే పెరుగుకు ఎప్పుడైతే నీటిని కలుపుతామో వెంటనే పెరుగుకు ఉన్న గుణాలన్నీ అది కోల్పోతుందన్నారు.

అంతేకాక మజ్జిగలో నీటితో పాటు కలిపే ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వంటివి కలపడం ద్వారా మజ్జిగ సరికొత్త ప్రయెజనాలను శరీరానికి అందిస్తుందని వివరించారు. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు శరీరానికి చలవ చేసే గుణాలను సంతరించుకుంటుందని డాక్టర్ జంగ్డా చెబుతున్నారు.

రెండింటికీ మధ్య వ్యత్యాసం ఏమిటి?

పెరుగులో ల్యాక్టోబాసిల్లస్ అనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పాలను పెరుగుగా మార్చుతుంది.

ఇది సజీవంగా మానవ శరీరంలోకి వెళ్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. దీనితో పాటు శరీరానికి మంచి చేసే ల్యాక్టోబాసిల్లస్ బల్గేరిస్, స్ప్రెప్టోకోకస్, థెర్మోఫైలస్ అనే బ్యాక్టీరియాలు కూడా జీర్ణ క్రియను మెరుగుపర్చడంలో చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

పెరుగును ఎవరు తినకూడదు..

డాక్టర్ జాంగ్డా తన ఇన్ స్టా వీడియో పెరుగును ఎవరు తీసుకోకూడదో కూడా వివరించారు.

పెరుగను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరైమన కొవ్వుతో పాటు శరీర సమతుల్యతను కాపాడటంలో మెరుగ్గా పనిచేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పెరుగును తినకపోవడం మంచిదని ఆమె వివరించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

ఒబెసిటీ, కఫం సమస్యలు, రక్తస్రావం, శ్వాస సంబంధిత సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు పెరుగును దూరం పెట్టడం ఉత్తమం.

జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు ఉన్నవారు కూడా పెరుగును తినకపోవడం మంచిది. ఒకవేళ రాత్రి సమయంలో తినాల్సి వస్తే పెరుగునకు మిరియాలు, లేదా మెంతులను తగు మోతాదులో కలిపి తీసుకోవచ్చు.

పెరుగును వేడి చేయకూడదు. అలా వేడి చేయడంవల్ల దానిలో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోయి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను పొందలేము.

అలాగే చర్మ సంబంధిత సమస్యలు, తలనొప్పి, నిద్ర సమస్యలు ఉన్నవారు కూడా పెరుగును దూరం పెట్టాలి.

పెరుగు స్థానంలో మజ్జిగ ఎందుకు?

పెరుగు స్థానంలో మజ్జిగ మంచి ప్రత్యామ్నాయం అని వైద్యురాలు వివరించారు. ఎందుకో చూద్దాం.. రెండు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకొని ఒక గ్లాస్ నీరు కలిపి బాగా చిలకరిస్తే మజ్జిగ అవుతుంది. దానిలో కొంచెం జీలకర్ర పొడి, ఉప్పును రుచి సరిపడా కలిపి తీసుకుంటే మంచి ప్రయెజనాలు ఉంటాయి.

దీని ద్వారా శరీరంలోని జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. ఆకలి లేకపోవడం, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే చలి కాలంలో జీర్ణక్రియ సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి.


/p>


Curd vs Buttermilk: పెరుగు, మజ్జిగలో ఇన్ని తేడాలు ఉన్నాయా? మరి ఏది ఆరోగ్యానికి చాలా మంచిది..

0 comments:

Post a Comment

Recent Posts