KVS Recruitment : Competent authority of KVS has decided to extend the last date of submission
of online application for Officers Cadres, Teaching and Non-Teaching Posts in KVS
from 26.12.2022 to 02.01.2023 (00.59 Hrs.).
Other terms and condition regarding age, qualification, experience etc. will
remain same (i.e. 26.12.2022) as mentioned in the Advertisement No. 15 & 16
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు!
KVS Recruitment : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది.
దరఖాస్తుల ప్రక్రియకు చివరిగడువు డిసెంబర్ 26గా నిర్ణయించారు. అయితే దరఖాస్తు గడువును 2023 జనవరి 2 వతేది వరకు పొడిగించారు. ఆమేరకు కేంద్రీయ విద్యాలయ సంగఠన్ ప్రకటనను జారీ చేసింది.
విద్యార్హతలు, వయసు, అనుభవం విషయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం లభించినట్లైంది.
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ, డిప్లొమా/బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్‌సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.2300లు, పీఆర్టీ,టీజీటీ,పీజీటీ,ఫైనాన్స్ ఆఫీసర్,ఏఈ,లైబ్రేరియన్,ఏఎస్‌ఓ,హెచ్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష తేదిని త్వరలో ప్రకటిస్తారు.
For Official Website Click here
For Detailed Notification Click here
0 comments:
Post a Comment