Organs: మన శరీరంలోని అవయవాలు వందేళ్లు పనిచేసేలా రూపకల్పన చేయబడ్డాయి. మనం తీసుకునే ఆహారాలు మనల్ని సమస్యలకు గురిచేస్తుంటాయి. శరీరంలో వైటలార్గాన్స్ మనం పడుకున్నా సరే పనిచేస్తూనే ఉంటాయి.
మన ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతో తోడ్పాటునందిస్తాయి. వైటల్ ఆర్గాన్స్ అంటే ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, కాలేయం, మెదడు అన్ని అవయవాలు.
వీటితోనే శరీరం పనిచేస్తుంది. ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ మన ప్రాణం నిలపడంలో సాయపడతాయి. వీటికి విశ్రాంతి ఇస్తే అవి ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తాయనడంలో సందేహం లేదు.
Organs
మనం రాత్రి పూట పడుకున్నప్పుడు మన శరీరంలోని అవయవాలు పడుకోవు. పనిచేస్తూనే ఉంటాయి. కాకపోతే మన మెలకువతో ఉన్నప్పటికంటే పడుకున్నప్పుడు అవయవాలు కాస్త నెమ్మదిగా పనిచేస్తాయి.
నిద్రపోతే జీవగడియారం ఆగిపోకుండా అవి నిరంతరం తమ విధులు కొనసాగిస్తూనే ఉంటాయి. ఈ వైటల్ ఆర్గాన్స్ కు విశ్రాంతి ఉండదా? ఇవి వందేళ్లు పనిచేయడానికే డిజైన్ చేయబడ్డాయా? పనిచేస్తూనే విశ్రాంతి తీసుకుంటాయా? పగటి సమయంలో అసలు వీటికి రెస్ట్ ఉండదు. కానీ రాత్రి సమయంలో అటు పనిచేస్తూనే విశ్రాంతి తీసుకుంటాయి.
సాయంకాలం పూట మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంకాలం సమయంలో ఉడికిన ఆహారం కాకుండా డ్రైఫ్రూట్స్ తీసుకుంటే తిన్నవి తొందరగా జీర్ణం అవుతాయి. దీంతో కాలేయానికి పని తప్పుతుంది. దీంతో కాస్త రెస్ట్ తీసుకుంటుంది.
ఇక గుండెకు కూడా కాస్త సమయం దొరుకుతుంది. రాత్రి సమయంలో గుండె 50-60 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది.
ఇలా అవయవాలు రాతరి సమయంలో వైటల్ ఆర్గాన్స్ కు పని లేకుండా చేసేందుకు మనం ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుని వాటికి సరిగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Organs
గుండె కు కూడా విశ్రాంతి ఇస్తుంది. పొట్టలో మనం తిన్న ఆహారం జీర్ణం కావడంతో మనలోని అన్ని అవయవాలు కాస్త రిలాక్స్ గా అవుతాయి. వాటికి ఇచ్చిన విశ్రాంతితో అవి మరి కొంత కాలం మన్నికగా జీవించే అవకాశం ఉంటుంది.
ఊపిరితిత్తులు కూడా 15-30 సార్లు కొట్టుకుంటాయి. పొట్టలో ఆహారం అరిగించడానికి ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఇలా మన అవయవాల పనితీరు మెరుగుపడేందుకు మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఆయుష్షు పెరుగుతుంది. అవయవాలకు రాత్రి సమయంలో రెస్ట్ ఇస్తూ కాలం గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.
0 comments:
Post a Comment