Tuesday, 13 December 2022

Pista Benefits: పిస్తాతో ఒత్తిడి సమస్య దూరం.. పిస్తా పప్పు ప్రయోజనాలను తెలిస్తే.. వావ్ అనకుండా ఉండలేరు

Pista Benefits: పిస్తాతో ఒత్తిడి సమస్య దూరం.. పిస్తా పప్పు ప్రయోజనాలను తెలిస్తే.. వావ్ అనకుండా ఉండలేరు

మీరు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తింటున్నారా? అన్నీ తిని ఆఖరున పిస్తా తినడం మర్చిపోతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే. ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే పిస్తా తినడం ద్వారా చాలా ఉపయోగాలున్నాయి.


 తీపి, ఉప్పగా ఉండే పిస్తా పప్పులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇతర డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే పిస్తాలో ఎక్కువ ప్రోటీన్ ఉండడమే కాకుండా తక్కువ క్యాలరీలు ఉంటాయి.

 అలాగే పిస్తాలో ఉండే అధిక ఫైబర్ పేగులకు కూడా మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సో పిస్తా పప్పు ఎలాంటి చింతా లేకుండా హ్యాపీగా ఎంత కావాలంటే అంత తినొచ్చు.



పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఒత్తిడి సమస్యకు చెక్

ప్రస్తుతం అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులే ఎక్కువ. దీంతో పని చేస్తున్న సమయంలో ఎక్కువుగా చిరుతిండ్లు తింటుంటారు.

దీని వల్ల అనవసర సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి అలా తినే సమయంలో పిస్తా పప్పు తింటే మంచిదని నిపుణుల అభిప్రాయం. అలాగే పిస్తా పప్పు తింటే ఒత్తిడి సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు.

ఆకలి సమస్య దూరం

మనం ఎప్పుడైనా పనిలో ఉన్నప్పుడు, లేదా తినడం ఆలస్యం అయినప్పుడు మామూలుగా కంటే ఎక్కువగా తినేస్తుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమయంలో పిస్తా తినడం వల్ల అధిక ఆకలి సమస్యను దూరం పెట్టవచ్చు. 

అలాగే వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే కార్భొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు సమతుల్యంగా అందించవచ్చు.

శాకాహారులకు ప్రోటీన్ సప్లిమెంట్

శాకాహారులు తమ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు అందించడానికి పరిమిత ఎంపికలు ఉంటాయి. అలాంటి వారు అధిక ప్రోటీన్ సప్లిమెంట్గా పిస్తా పప్పును తినవచ్చు.

జీర్ణ, మలబద్ధక సమస్యలు దూరం

పిస్తాను రోజుకోసారి తింటే శరీరానికి అధిక ఫైబర్ ను అందించవచ్చు. దీంతో జీర్ణ సమస్య దూరమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మలబద్ధక సమస్యలు ఉన్నవారు పిస్తాను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయని సూచిస్తున్నారు.


Pista Benefits: పిస్తాతో ఒత్తిడి సమస్య దూరం.. పిస్తా పప్పు ప్రయోజనాలను తెలిస్తే.. వావ్ అనకుండా ఉండలేరు

0 comments:

Post a Comment

Recent Posts