Saturday 3 December 2022

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ఆహార కోరికలు.. వీటిని తింటే తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా మంచిదిm

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ఆహార కోరికలు.. వీటిని తింటే తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా మంచిదిm

గర్భధారణ సమయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంతో పాటు జీవనశైలిలో ఎన్నో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పోషకాలున్న ఆహారం బాగా తీసుకోవాలి.


దీని వల్ల తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు ప్రయోజనకరంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అలాగే హార్మోన్లలో పలు మార్పులు సంభవిస్తాయి. 

FA 2 All subjects Key Sheets in pdf Download

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here


ఫలితంగా గర్భిణులు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు. అందులో ఆహార కోరికలు కూడా ఒకటి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలకు ఆహార కోరికలు (ఫుడ్‌ క్రేవింగ్స్‌) ఉండడం సహజమే. 

దీనికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఎటువంటి ఆహారం తీసుకున్నామనేదే ఇక్కడ ప్రధాన అంశం. 

ఏది పడితే అది కాకుండా పోషకాలుండే ఆహారాన్ని బాగా తీసుకోవాలి. మరి గర్భిణులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, స్నాక్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.

వేయించిన చిక్ పీస్

గర్భధారణ సమయంలో పదే పదే ఆకలి వేస్తున్నట్లయితే వేయించిన చిక్‌పీస్ (బఠానీలు) తీసుకోవడం మంచిది.

ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్ B-6 , మెగ్నీషియం వంటి పోషకాలు వీటిలో ఉంటాయి. పైగా కాల్చడం వల్ల ఇవి మరింత రుచిగా ఉంటాయి.

పెరుగు

చల్లగా, రుచికరంగా ఏదైనా తినాలని అనిపిస్తే పెరుగు స్మూతీ బెస్ట్‌ ఆప్షన్‌. ప్రెగ్నెన్సీ సమయంలో స్మూతీ తీసుకోవడం వల్ల సరైన పోషకాలు శరీరానికి అందుతాయి. దీన్ని తీసుకోవడం రోజంతా ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు. చాలా పండ్లలో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. 

వీటిని ఎక్కువగా తీసుకోవడం పిల్లల ఎదుగుదలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉడికించిన గుడ్లు

గర్భధారణ సమయంలో ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పిల్లల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

గుడ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

 ఉడికించిన గుడ్లు రోజులో ఎప్పుడైనా తినవచ్చు. ఇది ఆకలిని తీర్చడమే కాకుండా శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని కూడా ఇస్తుంది.

నట్స్‌

మహిళలకు నట్స్‌ ఉత్తమమైన చిరుతిండి. ఇందుకోసం బాదం, జీడిపప్పు, పిస్తా లేదా వాల్‌నట్‌లను చేర్చుకోవచ్చు. ఇవి గర్భిణుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నట్స్‌లో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఖనిజాలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

పీనట్‌ బటర్‌

గర్భధారణ సమయంలో కూడా పీనట్‌ బటర్‌ తినవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల పీనట్‌ బటర్‌లో 8 గ్రాముల మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.


నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ఆహార కోరికలు.. వీటిని తింటే తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా మంచిదిm

0 comments:

Post a Comment

Recent Posts