Sunday 4 December 2022

Stretch Marks: మీకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? ఈ టిప్స్ తో దూరం చేసుకోండి!

Stretch Marks: మీకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? ఈ టిప్స్ తో దూరం చేసుకోండి!

డెలివరీ తర్వాత మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య స్ట్రెచ్మర్క్స్. బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి.

 స్ట్రెచ్‌ మార్క్స్‌ కారణంగా నచ్చిన బట్టలు వేసుకోలేరు. వీటిని కవర్‌ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్ట్రెచ్ మార్క్స్‌ను పోగొట్టుకోవడానికి చాలా మంది అనేక రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు.


 కానీ, వీటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యకి ఇంట్లో లభించే కొన్ని న్యాచురల్‌ పదార్థాలతోనే చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న టిప్స్‌తో స్ట్రెచ్‌ మార్క్స్‌ పొగొట్టుకోవచ్చు. 

అవేంటో తెలుసుకుందాం.

కలబంద గుజ్జు:

కలబంద స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్యకు చెక్‌ పెడుతుంది. దీనిలోని ఔషధ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. కలబంద గుజ్జును తీసుకుని స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్నచోటు అప్లై చేసి అరగంట పాటు మసాజ్‌ చేయండి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ ఇలా చేస్తే స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్య క్రమంగా తగ్గుతుంది.

కోకో బటర్‌:

కోకో బటర్‌ స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్యను దూరం చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు కోకో బటర్‌ను ఎఫెక్టెడ్‌ ప్రాంతంలో అప్లై చేయండి. ఉదయం లేచిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఇలా ప్రతి రోజూ చేస్తే కొన్ని రోజులకు స్ట్రెచ్‌ మార్క్స్‌ ప్రాబ్లమ్‌ పరిష్కారం అవుతుంది.


కీరా, నిమ్మరసం:

నిమ్మరసంలో యాసిడ్‌ గుణం స్ట్రెచ్‌ మార్క్స్‌ను మాయం చేయడంలో సహాయపడుతుంది. కీరా రసంలోని కూలింగ్‌ ఎఫెక్ట్‌ మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. నిమ్మరసం, కీరా రసాన్ని సమంగా తీసుకుని ఎఫెక్టెడ్‌ ప్రాంతంలో అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇలా తరచుగా చేస్తే ఈ సమస్య దూరం అవుతుంది.

బంగాళాదుంప రసం:

బంగాళాదుంపను సగం ముక్క కోసి. మీ ముక్కతో స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న చోట 10 నిమిషాల పాటు రుద్దాలి. ఆది ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోండి. బంగాళాదుంప రసంలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మకణాల ఎదుగుదలను ప్రేరేపించి సాధారణ స్థితికి తీసుకువస్తాయి.


="font-family: "Noto Sans"; margin-left: 0px; margin-right: 0px; overflow-wrap: break-word;">సాండల్‌వుడ్‌ ఆయిల్‌:

స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్యను దూరం చేయడానికి సాండల్‌వుడ్‌ ఆయిల్‌ సహాయపడుతుంది. ప్రతి రోజూ స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న ప్రాంతంలో సాండల్‌వుడ్‌ ఆయిల్‌ అప్లై చేస్తే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

మాయిశ్చరైజర్:

రోజూ మాయిశ్చరైజర్ రాస్తే చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుంది. స్ట్రెచ్‌ మార్క్స్ పైన మాయిశ్చరైజర్ రాస్తే క్రమంగా ఈ సమస్య దూరం అవుతుంది.

ఆముదం:

స్ట్రెచ్‌ మార్క్‌ సాధరణంగా ముడుచుకుని, ఎండినట్లు ఉంటాయి. వీటికి తేమ అందిచడం చాలా అవసరం. ఆముదంతో స్ట్రెచ్‌ మార్క్‌ ఉన్న ప్రాంతాన్ని మాసాజ్‌ చేస్తే నెమ్మదిగా నయం అవుతాయి.



Stretch Marks: మీకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? ఈ టిప్స్ తో దూరం చేసుకోండి!

0 comments:

Post a Comment

Recent Posts