Thursday, 8 December 2022

Thyroid problem home remedies: థైరాయిడ్ సమస్యని నియంత్రించే ఇంటి చిట్కాలుగురించి తెలుసా..

 Thyroid problem home remedies: థైరాయిడ్ సమస్యని నియంత్రించే ఇంటి చిట్కాలుగురించి తెలుసా..

ఈరోజుల్లో చాలామంది ప్రజలు థైరాయిడ్ సమస్య వల్ల ఎంతగానో బాధపడుతున్నారు. 

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here

అయితే ఈ థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచుకోవడంలో ధనియాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి.


నీళ్లు బాగా వేడి చేసి అవి మరిగిన తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులో తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి కొరకు అర టి స్పూన్ తేనెను ఇంకా ధనియాలు వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న దనియాల కాషాయాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరి గడుపున తీసుకోవడం వల్ల హైపోథైరాడిజాం అదుపులో ఉండే అవకాశం ఉంది.

 ఇంకా చెప్పాలంటే ఈ కాషాయాన్ని తాగడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే థైరాయిడ్ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారాల్లో అవిసె గింజలు కూడా ఎంతో మంచివి. 



థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచుకోవడంలో అవిసె గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఇంకా చెప్పాలంటే థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడేవారు. ముందుగా ఒక కళాయిలో అవిసె గింజలను వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.  తర్వాత వీటిని జార్లో వేసి బాగా మెత్తగా పొడిగా చేసుకోవాలి.

అంతేకాకుండా ఆ పొడిని గాజు సీసాలో వేసి ఒక నెలరోజుల పాటు నిల్వ ఉంచుకోనే అవకాశం ఉంది. ఇలా రెడీ చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ తీసుకుని గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి ప్రతి రోజు ఉదయం పరిగడుపున తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఒకవేళ ఇలా నీటిని తాగాలని వారు ఒక టీ స్పూన్ అవిసపొడి తిని ఆ తర్వాత తాగడం కూడా మంచిదే. ఇలా చేస్తే కచ్చితంగా ఆ సమస్య తగ్గిపోతుంది. 

ఇంకా చెప్పాలంటే థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడేవారు క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి వంటి కూరగాయలను తక్కువగా తీసుకోవడం చేయాలి. 
ఇంకా అలాగే పాల పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవడం మంచిదే. ఆహారంలో విటమిన్స్ ఇంకా అలాగే ఐరన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

ఈ నియమాలను పాటించడం వల్ల థైరాయిడ్ సమస్య పూర్తిగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Thyroid problem home remedies: థైరాయిడ్ సమస్యని నియంత్రించే ఇంటి చిట్కాలుగురించి తెలుసా..

0 comments:

Post a Comment

Recent Posts