Sunday 25 December 2022

Weight Loss Tips: చలి కాలంలో బరువు తగ్గడాని అల్పాహారంలో వీటిని తీసుకోండి..

Weight Loss Tips: చలి కాలంలో బరువు తగ్గడాని అల్పాహారంలో వీటిని తీసుకోండి..

Breakfast Options For Weight Loss: బరువు పెరగడం ఎంత కష్టమో బరువు తగ్గడం కూడా అంతే కష్టమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

To join My Telegram Channel Click here

Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here


అయితే బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా పలు ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం తప్పకుండా అల్పాహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం పూట ఆల్పాహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు మొదలైనవి తీసుంటే ఆకలిని నియంత్రించి.. ఊబరకాయం సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా బ్రేక్‌ ఫాస్ట్‌లో ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


అల్పాహారంలో ఏయే ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్లు:

గుడ్లు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన కొవ్వులు, ప్రోటీన్లు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ టిఫిన్‌లో తీసుకుంటే బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


ఓట్ మీల్:

ఓట్ మీల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగానూ ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకోవడం ఆకలి నియంత్రణలో ఉంచుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా టిఫిన్‌లో ఓట్ మీల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.


స్ప్రౌట్ సలాడ్:

చాలా మంది స్ప్రౌట్ సలాడ్ తినడానికి ఇష్టపడరు. ఈ పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్‌లో చాట్ మసాలాను వినియోగించి ప్రతి రోజూ ఆల్పాహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు.


అరటిపండు:

అల్పాహారంలో అరటిపండ్లు తినడం వల్ల కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, క్యాలరీలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించి సులభంగా బరువును తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా అరటిపండును ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.


Weight Loss Tips: చలి కాలంలో బరువు తగ్గడాని అల్పాహారంలో వీటిని తీసుకోండి..

0 comments:

Post a Comment

Recent Posts