Sunday 11 December 2022

Yoga For Liver Health | మీ కాలేయం ఆరోగ్యాన్ని కాపాడాలంటే.. ఈ యోగా ఆసనాలు వేయండి!

Yoga For Liver Health | మీ కాలేయం ఆరోగ్యాన్ని కాపాడాలంటే.. ఈ యోగా ఆసనాలు వేయండి!

నేటి వేగవంతమైన ప్రపంచంలో, అన్ని వయసుల వారు ఏదో ఒకరకమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రోజూవారీగా ఉండే బిజీ షెడ్యూల్లతో శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు.

పోషక రహితమైన అసమయ భోజనాలు, అధిక ఒత్తిడి స్థాయిలతో డయాబెటిస్, గుండె జబ్బుల కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. 


అదేవిధంగా మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలతో పాటు, శరీరంలోని కీలకమైన అంతర్గత అవయవం కాలేయం కూడా క్షీణించిపోతుంది

ఇక్కడ కాలేయ పనితీరు గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతిరోజూ తినే ఆహారం నుంచి శక్తిని నిక్షిప్తం చేయడం, వేసుకునే ఔషధాలను జీవక్రియ చేయడం, లిపిడ్ జీవక్రియ కోసం కొవ్వులను విచ్ఛిన్నం చేయడం, కొవ్వు ఆమ్లాల రవాణా కోసం ప్రోటీన్‌లను సంశ్లేషణ చేయడం, హానికరమైన వ్యర్థాలను నిర్విషీకరణ చేయడం వంటి అనేక ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది.

 ఆల్కాహాల్, డ్రగ్స్, చెడు కొవ్వులు మొదలైనవి కాలేయంపై తీవ్ర పభావం చూపుతాయి. ఫలితంగా శరీరంలోని వ్యవస్థలన్నింటిపై దీని ప్రభావం ఉంటుంది.

కాలేయం బలహీనమైనప్పుడు, కీలకమైన శారీరక కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి, ఫ్యాటీ లివర్ వ్యాధి, పచ్చ కామెర్లు, హెపాటిక్ సిర్రోసిస్, ఫైబ్రోసిస్, హెపటైటిస్, లివర్ ఫెయిల్యూర్ , కాలేయ క్యాన్సర్ వంటి అనేక తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కీలకం.

Yoga Asanas For Liver Health - కాలేయ ఆరోగ్యానికి యోగా

సమతుల్య ఆహారం, సరైన హైడ్రేషన్ , ఆరోగ్యకరమైన నిద్ర విధానాలతో పాటు యోగా అభ్యాసం కాలేయ ఆరోగ్యానికి అత్యుత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. 

యోగా ఆసనాలతో శరీరాన్ని సాగదీయడం, వంగడం, లోతుగా శ్వాస తీసుకోవడం, కండరాలను వంచడం మొదలైన వాటికి అవకాశం ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, కాలేయంలో మంటను తగ్గిస్తుంది, శరీర శక్తి అవసరాలకు కొవ్వు మార్పిడిని వేగవంతం చేస్తుంది, నిర్విషీకరణ ప్రక్రియలను సులభతరం చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని యోగా ఆసనాలు ఇక్కడ చూడండి.అధో ముఖ స్వనాసన- Downward Facing Dog Pose

ఈ భంగిమ కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఉదర కండరాలను బలపరుస్తుంది. జీవక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.

బాలసనం- Child Pose

బాలసనం ఛాతీలో ఏదైనా ఒత్తిడిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మంచి నిద్ర కోసం ఈ యోగా ఆసనంను అభ్యాసం చేస్తారు. ఇది వీపు, వెన్నెముకకు విశ్రాంతినిస్తుంది, భుజాలు , చేతులు అనుభవించే ఒత్తిడిని తగ్గిస్తుంది.

అనులోమ విలోమ ప్రాణాయామం- Alternate Nostril Breathing

ఇది శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది, మెరుగైన సహనం, దృష్టి , నియంత్రణ. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం. మెదడు, శ్వాసకోశ, హృదయనాళ, కాలేయ ఆరోగ్యానికి ఈ ఆసనం గొప్పది.

ధనురాసనం- Bow Pose

దీనిని విల్లు భంగిమ అని కూడా అంటారు. ఈ భంగిమ వెనుక, ఉదర కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

 రక్త ప్రసరణను మెరుగుపరచడం, మధుమేహం నిర్వహణ, వెన్నుపూస, శరీర భంగిమను సర్దుబాటు చేయడంతో పాటు జీర్ణ సమస్యలు, ఛాతీ సమస్యలు లేకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


Yoga For Liver Health | మీ కాలేయం ఆరోగ్యాన్ని కాపాడాలంటే.. ఈ యోగా ఆసనాలు వేయండి!

0 comments:

Post a Comment

Recent Posts