Friday, 6 January 2023

AP Police Recruitment Last Date : కానిస్టేబుల్ ఉద్యోగ దరఖాస్తుకు రేపే చివరి తేదీ

 AP Police Recruitment Last Date ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ నియామకాలకు దరఖాస్తుల్ని సమర్పించేందుకు గడువు రేపటితో ముగియనుంది. స్టేల్‌ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో 6100 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.


ఆన్లైన్ దరఖాస్తులకు మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో వీలైనంత త్వరగా దరఖాస్తులు సమర్పించాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి సూచించారు. అభ్యర్థులు దరఖాస్తుల్ని https://slprb.ap.gov.in ద్వారా సమర్పించాలని సూచించారు.

రాష్ట్రంలో 6,511 పోలీస్‌ నియామకాలకు గత అక్టోబర్‌లో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


గతంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోలీస్‌ నియామక నిబంధనల్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో ఇకపై హోంగార్డులకు రిజర్వేషన్ వర్తింప చేయనున్నారు. సివిల్‌ కానిస్టేబుళ్ల నియామకంలో 15శాతం, ఏఆర్‌ కానిస్టేబుల్ల నియామకంలో 15 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల నియామకంలో 25శాతం, ఎస్‌ఏఆర్‌సీఏఎల్‌ కానిస్టేబుల్ నియామకాల్లో 25శాతం, కమ్యూనికేషన్ విబాగంలో 10శాతం, ఫిట్టర్‌ ఎలక్ట్రిషియన్ పోస్టుల్లో 5శాతం, మెకానిక్ పోస్టుల్లో 10శాతం, డ్రైవర్ పోస్టుల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.

ఏపీలో పనిచేస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

పోలీసు నియామక ప్రక్రియ నిబంధనల్ని సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్‌- ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్‌ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లను వర్తింప చేయనున్నారు.

కానిస్టేబుల్ నియామకాల్లో సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో హోంగార్డులకు రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, ఫిట్టర్‌ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్‌ కేటగిరీల్లో కేవలం పురుష కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనుండటంతో ఆ విభాగాల భర్తీలో పురుష హోంగార్డులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్‌ నియామకాల్లో కేటగిరీల వారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు.

హోంగార్డులకు రిజర్వేషన్లు వర్తింప చేయడానికి 'ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రూల్స్‌ 1999'కి సవరణ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. కానిస్టేబుల్‌ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడంతో రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది.


కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తుల్ని సమర్పించడానికి రేపటితో గడువు ముగియనుంది.

AP Police Recruitment Last Date : కానిస్టేబుల్ ఉద్యోగ దరఖాస్తుకు రేపే చివరి తేదీ

0 comments:

Post a Comment

Recent Posts