క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఊరాటనిచ్చేలా ఆర్భీఐ ఆదేశాలు
ఆర్బీఐ తాజాా ఆదేశాలు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఊరాటనిచ్చేలా ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చే సరికి మనం చెల్లించాల్సిన బిల్లులు ఎన్నో ఉంటాయి.
రూం రెంట్, ఈఎంఐ, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటల్ బిల్లు, పేపర్ బిల్లు, డిటీహెచ్ బిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి.
అయితే ఇవన్నీ గడువు తేదీలు ఎప్పుడున్నాయో గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టమే. ఇలాగే మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకోండి.. అప్పుడు క్రెడిట్ కార్డు పేమెంట్ ఏ తేదీలోగా కట్టాలో గుర్తుంచుకోవడం కూడా కష్టమే.
ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు పేమెంట్‌ను డ్యూ డేట్‌లోగా చేయలేకపోయినా భయపడాల్సిన పని లేదు. ఇటీవల వీరికి ఊరట కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
క్రెడిట్ కార్డు పేమెంట్‌ను మిస్ చేసిన కస్టమర్లకు.. బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు 3 రోజుల వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. 3 రోజుల వరకు వారికి పేమెంట్ చేసేందుకు వీలు కల్పించాలని పేర్కొంది.
ఈ లెక్కన మీరు పొరపాటులో క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం మర్చిపోతే గనుక .. మరో 3 రోజులు అదనంగా ఛాన్స్ ఉంటుంది. ఈ తేదీల్లో మీరు ఎలాంటి ఫైన్ లేకుండానే పేమెంట్ పూర్తిచేయొచ్చు. అప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోరుపై ఏ ప్రభావం పడొదు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
అయితే ఆ 3 రోజుల వరకు కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టనివారికి జరిమానా తప్పనిసరి. నెక్ట్స్ బిల్లింగ్ సైకిల్‌కు ఇది యాడ్ అవుతుంది. లేట్ పేమెంట్ ఛార్జీ ఎంత అనేది బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు జారీ సంస్థలు నిర్ణయిస్తుంటాయి.
అవుట్ స్టాండింగ్ అమౌంట్‌ను బట్టి ఇది ఉంటుంది. ఇలాంటి లేట్ ఫీ ఛార్జీలు, ఇతర ఛార్జీలను ఏదైనా అవుట్ స్టాండింగ్ అమౌంట్‌పైనే విధించాలని, మొత్తం అమౌంట్‌పై కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడో స్పష్టం చేసింది.
ఉదాహరణకు ఎస్బీఐ కార్డు విషయానికి వస్తే.. మీ క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.500 నుంచి రూ.1000 మధ్యలో ఉంటే లేట్ పేమెంట్ ఫీజు రూ.400 ఉంటుంది. రూ. 1000 నుంచి రూ.10 వేల మధ్య అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే.. ఆలస్య రుసుం రూ.750 వసూలు చేస్తుంది.
రూ. 10 వేల నుంచి రూ.25 వేల వరకు అవుట్ స్టాండింగ్ అమౌంట్‌పై లేట్ ఫీ రూ.950గా నిర్ణయించింది SBI. ఇదే విధంగా రూ.25000- రూ.50 వేలకు అయితే రూ.1100 ఆలస్య రుసుం, రూ.50 వేలకుపైబడిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే రూ.1300 జరిమానా ఉంటుంది.
0 comments:
Post a Comment