Monday, 2 January 2023

గర్భిణీస్త్రీలు బార్లీ వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనలా..!

సాధారణంగా గర్భిణీలలో బిడ్డ ఎదుగుదలకు ఉమ్ము నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉమ్మనీరు పెరగడానికి బార్లీ ఎంతో సహాయపడుతుంది.ఇతర ఆహారాల మాదిరిగానే, బార్లీని మితమైన మొత్తంలో తీసుకోవడం సురక్షితం.

కానీ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ప్రత్యేకించి మీకు బలహీనమైన రోగనిరోధక శక్తి లేదా గ్లూటెన్ అలెర్జీ ఉంటే బార్లీ నీటిని తీసుకోకూడదు. ఈ నీటిని తరచూ తీసుకోవడం వల్ల గర్భిణీలు కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గర్భధారణ సమయంలో మలబద్ధకం, నీరు నిలుపుకోవడం లేదా మంట వంటి సమస్యలను తగ్గించడానికి బార్లీ నీరు చాలా బాగా సహాయపడుతుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం లో బాగా ఉపయోగపడుతుంది.


రోగనిరోధక శక్తి పెంచడానికి..
గర్భ ధారణ సమయంలో రోగ నిరోధక శక్తి చాలా అవసరం. తరచూ బార్లీ వాటర్ ని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తల్లి బిడ్డల యొక్క రోగ నిరోధక శక్తి పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.

మెదడు పెరుగుదలకు..
దీని వల్ల బిడ్డ యొక్క నాడి మండల వ్యవస్థ మెరుగుపడి,మెదడు కణజాలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.అవయవ లోపాలను సరిదిద్దుతుంది.

ఫోలిక్ యాసిడ్ ను పెంచడానికి..
కడుపుతో ఉన్న మహిళలకు పోలిక్ యాసిడ్ చాలా అవసరం. డాక్టర్లు కూడా పోలిక్ యాసిడ్ టాబ్లెట్లనే తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. 

కానీ సహజ మార్గంలో బార్లీ వాటర్ లో లభిస్తుంది. ఈ గంజిని రోజు ఉదయం తీసుకోవడం వల్ల, ఇందులో ఉన్న పోలిక్ యాసిడ్ బిడ్డ ఎదుగుదలకు, మరియు నార్మల్ డెలివరీ అయ్యేలాగా ప్రోత్సహిస్తుంది.

బిపిని కంట్రోల్లో ఉంచుతుంది ..
గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఎదుర్కొనే సమస్య అధిక బిపి. దీనివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి బార్లీ వాటర్ చాలా బాగా సహాయపడుతుంది.

దీని కోసం బార్లీ సీడ్స్ లో నైట్ అంతా నానబెట్టి, ఉదయాన్నే ఉడికించుకొని తీసుకోవడం వల్ల,రక్తప్రసరణ మెరుగుపడి,బీపీ కంట్రోల్ లో ఉంటుంది.



గర్భిణీస్త్రీలు బార్లీ వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనలా..!

0 comments:

Post a Comment

Recent Posts