Saturday, 28 January 2023

మీ పాన్ కార్డు అప్డేట్ చేయించాలనుకుంటున్నారా. అయితే ఇలా చేయండి..?

మీ పాన్ కార్డు అప్డేట్ చేయించాలనుకుంటున్నారా. అయితే ఇలా చేయండి..?


ప్రస్తుత కాలంలో ప్రతి పౌరుడికి పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. ప్రజలకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డు కూడా అంతే ముఖ్యమైనది. బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం దగ్గర నుండి అధిక మొత్తంలో లావాదేవీలు జరపటానికి పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

మనదేశంలో పాన్ కార్డు అనేది మనిషికి ఒక గుర్తింపు కార్డు. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి పాన్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి వ్యక్తికి పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని రూల్ ఉంది.


అయితే పాన్ కార్డ్ తీసుకున్న తర్వాత పొరపాటున అందులో మీ పేరు, అడ్రెస్స్, ఫోన్ నెంబర్ వంటివి తప్పులు ఉండటం వల్ల అనేక ఇబ్బందులు పడుతుంటారు. 

ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే వెంటనే మీ పాన్ కార్డు అప్డేట్ చేయించాలి. అయితే పాన్ కార్డు అప్డేట్ చేయించడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు గ్రీవెన్స్ సర్వీసు మరింత సులభతరం చేసింది. పాన్ కార్డు దారులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ ఫిర్యాదులు చేయవచ్చు. ఎలా ఫిర్యాదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.




పొరపాట్లకు సంబంధించి ఫిర్యాదు చేయండి ఎలా?సాధారణంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు జరిగే తప్పుల్లో ఒకటి పేరు తప్పుగా నమోదు కావడం. అలాగే ఒక్కోసారి పాన్ కార్డు మీద మీ ఫొటోకు బదులు మరొకరి ఫొటో రావడం, ఫొటో సరిగ్గా లేకపోయినా , ఒక్కోసారి అడ్రస్‌ తప్పుగా ఇవ్వడం, పేరులో తప్పుగా ఉండటం తదితర కారణాలతో వచ్చిన కార్డు అడ్రస్‌ తెలియక తిరిగి ఐటీ అధికారులకు చేరుతుంది. 

అలాంటి సమయంలో మనం ఐ టీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు చేయటానికి ముందుగా ఐ టీ విభాగం అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ‘పన్ను చెల్లింపుదారుల సేవలు’ అనే విభాగంపై క్లిక్ చేయాలి. 

ఆ తర్వాత ‘పాన్ గ్రీవెన్స్’ సెక్షన్‌కెళ్లాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. వెంటనే మీ కంప్లయింట్‌తోపాటు సంబంధిత సమాచారం (పేరు, పాన్ కార్డ్ నంబర్, వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్ ఐడీ) నమోదు చేసి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

ఆఫ్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ఆదాయం పన్ను విభాగం హెల్ప్ డెస్క్-18001801961, TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ కాల్ సెంటర్ +91 2027218080 నంబర్‌కు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.


అలాగే ask@incometax.gov.in అనే ఈమెయిల్ ఐ డి కి మెయిల్ చేయవచ్చు.

మీ పాన్ కార్డు అప్డేట్ చేయించాలనుకుంటున్నారా. అయితే ఇలా చేయండి..?

0 comments:

Post a Comment

Recent Posts