SSA AP Recruitment 2023: టెన్త్/డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్.. విజయవాడలోని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్‌లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 60 జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇతర పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
స్కిల్ టెస్ట్ ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఉంటుంది. ఫలితాలు ఫిబ్రవరి 13న వెల్లడిస్తారు.
ఎంపికైన వారికి నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.23,500, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,500, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.15,000లు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 13
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 10
- ఆఫీస్ సబార్డినేట్ పోస్టులుడ: 14
0 comments:
Post a Comment